అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road) కేసులో లోకేశ్‌కు సీఐడీ నోటీసులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు లోకేశ్ విచారణకు హాజరుకావాల్సి ఉందని సీఐడీ (CID) వాదించింది. అయితే సీఐడీ నోటీసుల్లో నిబంధనలపై లోకేశ్ (Lokesh) అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రేపు జరగాల్సిన విచారణను ఈ నెల 10కి వాయిదా చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. న్యాయవాది (Lawyer) సమక్షంలో విచారణ జరపాలని, గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీని సూచించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరయ్యేటప్పుడు హెరిటేజ్ (Heritage) సంస్థ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అకౌంటు పుస్తకాలు తీసుకురావాలని ఇటీవల సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. అయితే, హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ పదవికి తాను ఎప్పుడో రాజీనామా చేశానని, అలాంటప్పుడు ఆ సంస్థ లావాదేవీల వివరాలు, పద్దుల పుస్తకాలు తానెలా తీసుకువస్తానని లోకేశ్ అంటున్నారు. ఈ మేరకు తన లంచ్ మోషన్ పిటిషన్ (Motion Petition) లో ప్రస్తావించారు.