అక్టోబర్(October)లో పెద్ద సినిమాల సందడి తగ్గిపోగానే చాలా చిన్న సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. నవంబర్ ఫస్ట్ వీక్‌లో కీడాకోలా (Kida Cola Movie) లాంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే ‘ప్లాట్(Plot)’ అనే సినిమా కూడా విడుదలకు సిద్దమవుతోంది. నియో-నోయిర్ డ్రామాగా తెరకెక్కిన ‘ప్లాట్’ చిత్రానికి భాను భావ తారక రచన మరియు దర్శకత్వం వహించారు.
రూట్ సినిమాస్, తార కథలు ఫిల్మ్స్ బ్యానర్ (Films Banner)పై కార్తీక్ సేపురు, భాను భవ తారక మరియు తరుణ్ విఘ్నేశ్వర్ సేపూరు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా లీడ్ రోల్లో నటించగా.. సజీవ్ పసల, సంతోష్ నందివాడ, కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్గా వచ్చిన శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు1(Pedakapu 1)’ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు వికాస్ ముప్పాల. ఇక గాయత్రి గుప్తా గురించి అందరికీ తెలిసిందే. తెలుగు బిగ్ బాస్ సీజన్ (Bigg Boss3) విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది గాయత్రి గుప్తా.
దీంతో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్(Interesting)గా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్లాట్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాదు.. 13వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాకు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్(Director)గా గుర్తింపు దక్కింది. ప్లాట్ సినిమా రిలీజ్ అయ్యాక.. ఖచ్చితంగా క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటుందనే నమ్మకం ఉందని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు రామన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక్ రోడ్రిగ్స్ (Karthik Rodrigues) సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.