Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన (janasena) పార్టీ ప్రకటించింది. 32 చోట్ల బరిలోకి దిగుతామని పేర్కొంది. ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసింది. పొత్తులు ఉంటే ఉండొచ్చని.. చివరి క్షణంలో ప్రకటన చేస్తామని జనసేన ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి తెలిపారు.
పోటీ చేసే స్థానాలు ఇవే..
కూకట్ పల్లి, ఎల్బీనగర్, నాగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావు పేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిరలో పోటీ చేస్తామని ప్రకటించారు.
యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ జనసేన స్థాపించారని తెలిపారు. 25 సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందన్నారు. గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్ ఉందని వివరించారు. గత పదేళ్లలో పలు సమస్యలపై తెలంగాణ జనసేన పోరాటం చేసిందని చెప్పారు. నల్లమల యురేనియం తవ్వకాలు, మహిళలపై దాడుగుల, డ్రగ్స్ సమస్య, ఆర్టీసీ కార్మికుల సమస్య, బీసీ, ఎస్టీలతోపాటు విద్యార్థుల సమస్యలపై పోరాడుతామని ప్రకటించారు.
Jana Sena party to contest in 32seats in #Telangana with an aim to realize the goal of agitation
9 Constituencies in and around Hyderabad – Kukatpally, LB Nagar, Qutubullapur, Serilingampally SanathNagar, Uppal, Patancheruvu, Malkajgiri, Medchal