Powerful 7.5-Magnitude Earthquake Strikes Mindanao In Philippines
earthquake: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు (strong tremors) సంభవించాయి. సోమవారం అస్సోం, మేఘాలయలో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ రోజు దేశంలో అక్కడక్కడ ఈ తీవ్రత కనిపించింది. అలాగే మన పొరుగున ఉన్న నేపాల్‌లో వరుసగా భూకంపాలు (Earth quake) సంభవించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో దిల్లీ- ఎన్సీఆర్ (Delhi-NCR) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోలు చెందారు. దాంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ, హాపుర్, అమ్రోహా, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయ్యింది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది.