ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ వరుస హిట్స్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. తాజాగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విశ్వక్ సేన్‌తో ‘హిట్’మూవీ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొలను.. ఈ సారి అంతకు మించి అనేలా హిట్ 2 క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు.
ఈ సినిమాలో కేడీ అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు అడివి శేష్. ఖిలాడి బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 2న హిట్ 2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నాని, అడివి శేష్ ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.
ఇక ఈ ట్రైలర్ టీజర్ కంటే భయంకరంగా ఉందని చెప్పొచ్చు. అడివి శేష్ ఇన్వెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగినట్టు చూపించారు. అడివి శేష్ మరోసారి తన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. ట్రైలర్లో క్రిమినల్స్‌ను తేలిగ్గా తీసిపారేసిన మన హీరో.. చివరికి వాళ్లే చుక్కలు చూపించినట్టు చూపించారు. ఇలాంటి క్రిమినల్స్ కోడి బుర్రలని చెప్పిన హీరోని.. వాళ్లే హీరోని కోడి బుర్రను చేయడం ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఎండింగ్లో అమ్మాయి హత్య కేసులో ఇచ్చిన ట్విస్ట్ మరింత షాకింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంది. అది ట్రైలర్లో చూస్తేనే బాగుంటుంది. దాంతో హిట్ 2లో క్రైమ్ ఓ రేంజ్లో ఉండబోతోందని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. డిసెంబర్ 2న థియేటర్లో రక్తపాతం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే యూట్యూబ్ టీజర్‌ను బ్యాన్ చేసినట్టే.. ట్రైలర్‌ను బ్యాన్ చేసే విజువల్స్ ఇందులో లేవనే చెప్పాలి. మరి హిట్ 2 ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.