ఎన్టీఆర్ 30 నుంచి అఫిషీయల్‌గా ఎలాంటి అప్డేట్స్ లేవుగానీ.. కానీ ఫిల్మ్ నగర్లో మాత్రం ఏదో ఒక న్యూస్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఇప్పటి వరకు పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించగా.. నేషనల్ క్రష్ రష్మిక పేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. అయితే ఇంకా హీరోయిన్ మ్యాటర్ తేలలేదని తెలుస్తోంది. ఇప్పటికే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లైన్లో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే అమ్మడికి అంత ఈజీగా తారక్‌తో ఛాన్స్ దక్కుతుందా.. అని అనుకున్నారు.
కానీ రష్మికతో పాటే మృణాల్ కూడా ఎన్టీఆర్ 30 రేసులో ఉందట. దర్శకుడు కొరటాల శివ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే అసలే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. కానీ అప్పుడే హీరోయిన్ గురించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ 30 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది.. హీరోయిన్ ఎవరనే విషయాల్లో క్లారిటీ ఇవ్వాలంటున్నారు నందమూరి అభిమానులు. కానీ కొరటాల టీమ్ నుంచి ఇప్పటి ఎలాంటి స్పందన లేదు. దాంతో రోజు రోజుకి ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ఇకపోతే ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. ఎట్టి పరిస్థితుల్లోను ఎన్టీఆర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవాలని చూస్తున్నాడు. అందుకే పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాలని చూస్తున్నాడు. మరి ఎన్టీఆర్ 30 ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.