Mani Ratnam: సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన అద్భుత వజ్రం మణిరత్నం. ఇలాంటి దర్శకులు అరుదుగా ఉంటారు. అందరూ సినిమా తీయాలి అనుకుంటారు. ఆయనలా తీయడం అంటే ఓ ఆర్ట్. సినిమాని ఓ అద్భుతంలా చూపించడం ఆయనకే సాధ్యం. సినిమాలో పాత్రల భావోద్వేగాలను, సంఘర్షణను సృష్టించిన తీరు ఆకట్టుకుంటోంది. నాలుగు దశాబ్దాల సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్స్ రూపొందించారు.
పల్లవి అనుపల్లవి
మణిరత్నం 1983లో కన్నడ చిత్రం పల్లవి అనుపల్లవితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత మలయాళ చిత్రం ఉనరూ చేసాడు. తన మూడవ చిత్రం పగల్ నిలవుతో మాతృభాష తమిళంలోకి ప్రవేశించాడు. మరికొన్ని తమిళ చిత్రాల తర్వాత 1986లో బ్లాక్‌బస్టర్ మౌన రాగంతో తన శైలిని కనుగొన్నారు. అతను తన ప్రత్యేక శైలి, భావోద్వేగాలు చూపి ప్రశంసలు అందుకున్నాడు. ఆ సినిమా తెలుగులోకి అదే పేరుతో డబ్ చేశారు.
నాయకన్
కమల్ హాసన్ తో నాయకన్ సినిమా చేశాడు. ఇది అతనికి పేరు, కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఇది టైమ్స్ ప్రపంచంలోని అత్యుత్తమ 100 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత అగ్ని నక్షత్రం చేసాడు, ఇది కరుణానిది, ఆయన ఇద్దరు కుమారుల నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిన చిత్రం కావడం విశేషం. అంజలి చాలా మంది పిల్లలతో భావోద్వేగాలతో వ్యవహరించే పాత్ బ్రేకింగ్ చిత్రం. నాయకన్, అంజలి రెండూ ఆస్కార్ ఎంట్రీకి వెళ్లడం విశేషం.
గీతాంజలి
గీతాంజలి కోసం నాగార్జునతో కలిసి పనిచేశాడు, ఇదొక అందమైన ప్రేమ కథ. ఈ చిత్రం భారీ కమర్షియల్‌తోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మణిరత్నం కెరీర్లో ఇప్పటివరకు దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఇదే. రోజా, బాంబే, దిల్సేలతో టెర్రరిజం త్రయం సినిమా తీశాడు. మౌన రాగం, అలై పటుతే / సఖి, ఓ కాదల్ కన్మణి / ఓకే బంగారంతో రొమాంటిక్ సినిమాలు తీశాడు.
దళపతి.. అంజలి
అంజలి తర్వాత మణిరత్నం మహాభారతంలోని దుర్యోధన, కర్ణుల పాత్రల ఆధారంగా రజనీకాంత్, మమ్ముట్టిలతో దలపతి తీశారు. సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మణి రత్నం పనితనం, ఇళయరాజా సంగీతానికి విపరీతమైన క్రేజ్ ఉంది. రోజా, బొంబాయి చిత్రాలు ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. అతను MGR, కరుణానిధి, జయలలిత బయోపిక్‌ను ఇరువర్ / ఇద్దరుగా రూపొందించాడు. ఆ తర్వాత మణిరత్నం షారుఖ్ ఖాన్‌తో దిల్ సే, అభిషేక్, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లతో గురు అనే హిందీ సినిమాలు తీశాడు.
ఆదరణ
40 ఏళ్ల నుంచి సినిమాలు చేసినప్పటికీ కాలానికి తగ్గట్టుగానే ఉన్నారు. ఎప్పుడూ ఫ్యాషన్ మారలేదు. అతని సినిమాలు కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాయి. ఓకే బంగారం, నవాబ్, ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో మరోసారి తన టాలెంట్ చూపించారు. మణిరత్నం దర్శకత్వం నుంచి మరిన్ని మణులు వెండితెరపై మెరవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే చెబుతోంది హిట్ టీవీ మీడియా గ్రూప్.