ఈ మధ్య కాలంలో తెలుగులో ఓ చిన్న సినిమా ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయలేదనే చెప్పాలి. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సాలిడ్ సౌండ్ చేస్తోంది. జస్ట్ ప్రీమియర్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.
Hanuman: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా క్రేజ్ చూస్తే వావ్ అనాల్సిందే. ఓ చిన్న సినిమాగా మొదలైన హనుమాన్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వచ్చేలా చేస్తోంది. అసలు హనుమాన్ సినిమాకు పెట్టిన ఖర్చుకు, జరిగిన బిజినెస్‌కు సంబంధమే లేకుండా.. ఓ పెద్ద సినిమా రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే బాబుని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అయినా కూడా తగ్గేదేలే అంటోంది హనుమాన్.
ఓ రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేసి సినిమా హైప్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లారు మేకర్స్. ముందుగా సింగిల్ డిజిట్‌తో మొదలైన హనుమాన్ ప్రీమియర్స్ స్క్రీన్ కౌంట్.. ఇప్పుడు త్రీ డిజిట్‌కు చేరుకొని దాదాపు 383 షోల వరకు పెంచేశారు. బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేట్ టికెట్స్ హాటు కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్, వైజాగ్ లాంటి నగరాల్లో హనుమాన్ పెయిడ్ ప్రీమియర్లకు భారీ స్పందన వస్తోంది. దీంతో స్క్రీన్స్ ఇంకా పెంచుతునే ఉన్నారు మేకర్స్.
ఓవర్సీస్‌లోను హనుమాన్ క్రేజ్ మామూలుగా లేదు. గుంటూరు కారం తర్వాత సంక్రాంతి సినిమాల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది హనుమాన్. ఇక ప్రీమియర్స్ నుంచి సినిమా టాక్ ఏ మాత్రం బాగున్నా సరే.. హనుమాన్కు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా.. హనుమాన్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. మరి హనుమాన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.