»Krishnamma Pratinithi 2 Are The Films That Will Be Released In Theaters And Ott This Week
Krishnamma: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో అలరించబోయే చిత్రాలివే
ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా సినిమాలు విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లో సైతం చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో చూడండి.
Krishnamma, Pratinithi 2 are the films that will be released in theaters and OTT this week
Krishnamma: విలక్షణ పాత్రలతో అలరించే హీరో సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ (Krishnamma) మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. దీనిలో అతీరా రాజ్ కథానాయికగా నటిస్తుంది.
జర్నలిస్ట్ మూర్తి డైరక్షన్ చేసిన చిత్రం ప్రతినిధి2(prathinidhi 2). నారా రోహిత్ హీరోగా ప్రతినిధి మూవీకి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. సిరీ లెల్లా హీరోయిన్గా నటిస్తున్నారు. సప్తగిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా లాంటి భారీ తారాగనం నటిస్తున్న ఈ సినిమా మే 10న విడుదలకు సిద్ధం అయింది. పొలిటికల్ కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా మూవీ జితేందర్‌రెడ్డి(Jithender Reddy). 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కూడా మే 10 నే ప్రేక్షకుల ముందుకు రానుంది.
వినుత్నమైన కంటెంట్‌తో మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరంభం’ (Aarambam). అజయ్ నాగ్ వి (Ajay Nag) దర్శకత్వంలో మే 10న విడుదల కానుంది. అలాగే మరో అద్భుతమైన ఇంగ్లీష్ సినిమా రానుంది. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (kingdom of the planet of the apes) చిత్రం మే 10న థియేటర్లో విడుదల కానుంది. వీటితో పాటు ఓటీటీ చిత్రాలలో కూడా తెలుగులో పెద్దగా చిత్రాలు లేవు.
నెట్ ఫ్లిక్స్
బోడ్కిన్ (వెబ్ సిరీస్) మే 9
మదర్ ఆఫ్ ది బ్రైడ్(హాలీవుడ్) మే9
థాంక్యూ నెక్ట్స్(వెబ్ సిరీస్) మే 9
అమెజాన్
ఆవేశం(మలయాళం)మే 9
ది గోట్(వెబ్ సిరీస్) మే 9
యోధ మే 10