Guntur Kaaram: ‘గుంటూరు కారం’ మేకింగ్ వీడియో అదిరింది!
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ గుంటూరు కారం సందడి స్టార్ట్ అయిపోయింది. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి.. రిలీజ్‌కు ఓ రోజు ముందు మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా అదిరిపోయింది.
Guntur Kaaram: మహేష్ బాబు రన్నింగ్ స్టైల్, స్మోకింగ్ స్టైల్‌కి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అసలు బాబు స్టైల్‌ని మిగతా హీరోలు మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే.. మధ్యలో స్మోకింగ్‌కు దూరంగా కాస్త మెసేజ్ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తు వచ్చాడు మహేష్ బాబు. కానీ గుంటూరు కారం లెక్క వేరే. పోకిరి రేంజ్ మాస్ బొమ్మగా త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మాస్ మూవీగా గుంటూరు కారం వస్తోంది. నోట్లో బీడి, తలకు రూమాలుతో ఉన్న మహేష్‌ను చూస్తే.. థియేటర్లు షేక్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్‌తో అన్ని రికార్డ్స్‌ని మడతపెట్టేశాడు మహేష్.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశాడు. ఇప్పుడు మేకింగ్ విడియో రిలీజ్ చేయగా అదిరిపోయింది. మాస్ స్ట్రైక్, ట్రైలర్‌తో బీడిని త్రీడిలో చూపించిన మహేష్.. మేకింగ్ వీడియోలో అసలు సిసలైన కిక్ ఇచ్చాడు. ఇందులో బాబు జోష్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. బీడితో మ్యాజిక్ చేసేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం గుంటూరు కారం మేకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదే హైలో థియేటర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.
అర్థరాత్రి ఒంటిగంట నుంచే గుంటూరు కారం రచ్చ రంబోలా అంటోంది. ఈ సినిమాతో రీజనల్ లెవల్లో మహేష్ బాబు క్రియేట్ చేయబోయే రికార్డులు మామూలుగా ఉండవని బుకింగ్స్‌తోనే చెప్పేశారు. ఖచ్చితంగా గుంటూరు కారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి గుంటూరు కారం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.