ASF: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. MLA కోవ లక్ష్మి తోడికోడలు కోవ దేవేంద్ర బాయి తిర్యాణి మండలం భీమ్ జై గూడ సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. పెద్ద కోడలు MLA కాగా, చిన్న కోడలు సర్పంచ్ గెలవడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.