CTR: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. డిజిటల్ న్యాయపాలన సమర్థత-సత్వర పరిష్కారం అంశంపై పోటీలుంటాయన్నారు. జిల్లాస్థాయి విజేతలు ఈనెల 23న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.