KMM: ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో కొత్త కరెంట్ సబ్ స్టేషన్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు కందిమళ్ల వీరబాబు ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి వెళ్లడంతో వారు తక్షణమే స్పందించినట్లు వారు తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే ఎకరం స్థలాన్ని విద్యుత్ డిపార్ట్మెంట్కు అప్పగించారు.