TG: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవేపై మొయినాబాద్ మండలం కనకమామిడి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద తీవ్రతకు 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి.