»Hanuman Another New Record For Hanuman Ott Date Fix
Hanuman: హనుమాన్ మరో కొత్త రికార్డ్.. ఓటిటి డేట్ ఫిక్స్!
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ఎన్నో రికార్డ్స్ తన పేరిట నమోదు చేసుకుంది హనుమాన్. దీంతో హనుమాన్ మరో సెన్సేషన్ అనే చెప్పాలి.
Hanuman: యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ.. సంక్రాంతి హిట్‌గా నిలిచింది. మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వంటి సినిమాలతో పోటీ పడి మరీ.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమాను థియేటర్లో చూడలేకపోయిన ఆడియెన్స్.. ఓటిటి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా హనుమాన్ ఓటిటి డేట్ గురించి చర్చ జరుగుతోంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలోనే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు. ఆ తర్వాత మార్చి 1న వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు మరో డేట్ లాక్ చేశారు. హనుమాన్ ఓటిటి హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది. దీంతో మార్చి 8 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది హనుమాన్.
ఇదిలా ఉంటే.. జనవరి 12న రిలీజ్ అయిన హనుమాన్.. 150 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకొని ఎక్కువ థియేటర్స్‌లో ఎక్కువ రోజులు ఆడి మరో రికార్డ్ సెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం 300 సెంటర్స్‌లో 30 రోజులు ఆడిన ఈ సినిమా.. 150 సెంటర్స్‌లో 50 డేస్ అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సైతం ఇలాంటి ఫీట్‌ను అందుకోవడం కష్టంగా ఉంది. కానీ హనుమాన్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది.