Movie Teaser Release: యూత్ కోసం వస్తోన్న ‘గేమ్ ఆన్’..టీజర్ రిలీజ్
టాలీవుడ్ కి గీతానంద్(Geethanand) అనే కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. 'గేమ్ ఆన్'(Game On) అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Movie Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టాలీవుడ్(Tollywood)లోకి నూతన నటీనటులు విభిన్నమైన కంటెంట్ తో వస్తున్నారు. ఓటీటీ(OTT)లు వచ్చాక సరికొత్త కథాంశాలతో కూడుకున్న కథలు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. కొత్త వారిని ప్రోత్సహిస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేస్తున్నారు. సరికొత్త కంటెంట్ తోనే తాజాగా టాలీవుడ్ కి గీతానంద్(Geethanand) అనే కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. ‘గేమ్ ఆన్'(Game On) అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. కస్తూరి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.
‘గేమ్ ఆన్’ మూవీ టీజర్:
‘గేమ్ ఆన్'(Game On) మూవీకి దయానంద్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Movie Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టాలీవుడ్ హీరో విష్వక్ సేన్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే కథ మొత్తం సైకలాజికల్ గేమ్ చుట్టూ తిరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలోని యాక్షన్, రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన సీన్స్ ను టీజర్ గా రిలీజ్(Teaser Release) చేశారు. ‘గేమ్ ఆన్’ టీజర్ ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాకు అశ్విన్, అర్జున్ సంగీతాన్ని(Music) అందించారు. అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.
ఈ మూవీలో కథానాయిక(Heroine)గా నేహా సోలంకి నటిస్తోంది. ఈ హీరోయిన్ ఇది వరకూ టాలీవుడ్ హీరో కార్తికేయ(Hero karthikeya) నటించిన ’90ML’ అనే సినిమాలోనూ కథానాయికగా చేసింది. ఆదిత్య మీనన్, మధుబాల వంటివారు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.