రామాయణ (Ramayana)పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకానికి గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ ‘(Adipurush)’సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ‘ఆదిపురుష్’ ని హనుమంతుడి (Lord Hanuman)సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం” అంటూ చిత్ర యూనిట్ తాజా ప్రకటనలో భాగంగా పేర్కొంది.
అయితే ఖాళీగా ఉన్న సీటు పక్కనే ఉన్న సీటు కోసం థియేటర్లు (Theaters) భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని రూమర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు ఖాళీ సీట్ల పక్కనే ఉన్న సీట్లకు టిక్కెట్లు కొని బ్లాక్‌లలో పెట్టి భారీ మొత్తానికి విక్రయిస్తున్నారనే వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్(T Series) ట్వీట్ చేస్తూ.. ‘ఆదిపురుష్ టిక్కెట్ ధరపై మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలు వస్తున్నాయి. ఆంజనేయుడికి రిజర్వు(Reserve) చేసిన పక్కనే ఉన్న సీట్ల ధరల్లో ఎలాంటి తేడా లేదని, మిగతా సీట్ల మాదిరిగానే వాటి ధర ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. తప్పుడు వార్తలను నమ్మవద్దు.’ అని ట్వీట్(Tweet) చేసింది.