»Shivaratri Special Movies In Theaters And Ott This Week
Shivaratri special: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించే శివరాత్రి స్పెషల్ మూవీస్
ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్లో, ఓటీటీలో అలరించడానికి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా శివరాత్రి ఉంది కాబట్టి భక్తులను మెప్పించే సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా.
Shivaratri special movies in theaters and OTT this week
Shivaratri special: ఈ వారం శివరాత్రి స్పెషల్ కూడా ఉంది. భక్తులు జాగారంతో పాటు కాలక్షేపానికి భక్తి సినిమాలు చూస్తూంటారు. అందులో భాగంగా శివ భక్తిని చూపించే సినిమాలు కూడా ఈ మహాశివరాత్రికి విడుదల అవుతున్నాయి. అందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి ఒకటి. అలాగే గోపిచంగ్ నటించిన భీమా కూడా ఉంది. వీటితో పాటు హిందీ రీమేక్ సినిమాలు ఉన్నాయి. అలాగే ఓటీటీ సినిమాలు కూడా భారీగానే ముస్తాబు అయ్యాయి. మరి అవేంటో చూసేయండి.
భీమా
గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ డైరెక్టర్ ఎ. హర్ష రాసుకున్న ఫాంటసీ యాక్షన్ డ్రామా భీమా. మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. గామి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం గామి (Gaami). విద్యాధర్ డైరెక్టర్‌గా పరిచయం అవున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్గా నటిస్తుంది. అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి అఘోరగా ఎలా మారాడు, దాన్ని నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రేమలు
మలయాళంలో చిన్న బడ్జెట్‌తో రూపొంది భారీ బడ్జెట్ వసుల్ చేసిన చిత్రం ప్రేమలు(Premalu). నస్లెన్ కె. గఫూర్ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రల్లో గిరీశ్ ఎ.డి. తెరకెక్కించారు. షూటింగ్ చాలా వరకు మన హైదరాబాద్‌లోనే తీశారు. మలయాలంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు చిత్రాన్ని కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వీటితొ పాటు రికార్డు బ్రేక్, నవ్వించే బాయ్స్, నాయుడిగారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి, అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైతాన్ చిత్రాలు వస్తున్నాయి.
ఓటీటీ వేదికగా.. వళరి ఈటీవీ విన్లో మార్చి 6న విడుదల అవుతోంది. అన్వేషిప్పిన్ కండెతుమ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా మార్చి 8న స్ట్రీమింగ్ కానుంది. సాగు మార్చి 4న అమెజాన్ ప్రైమ్‌లో రానుంది.