ఎట్టకేలకు రామ్ చరణ్(ram charan) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇన్ని రోజులుగా అదిగో, ఇదిగో అంటూ వచ్చిన గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ బయటికి రాబోతోంది.
గేమ్ చేంజర్(Game changer) సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పకపోయినా.. కనీసం సాంగ్ రిలీజ్ చేసిన చాలని అంటున్నారు మెగాభిమానులు. ఎట్టకేలకు.. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను దసరాకు విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు. రేపో మాపో ఈ సాంగ్ నుంచి అఫిషీయల్ అప్డేట్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. సాంగ్ ఫైనల్ వెర్షన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా లీక్ అయిన జరగండి అనే సాంగ్‌నే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం. కానీ లీక్డ్ వెర్షన్ ఫైనల్ కాదని అన్నారు.
అందుకే ఇప్పుడు ఫైనల్ వెర్షన్ ఎలా ఉంటుందోనని ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. ఎందుకంటే.. లీక్డ్ సాంగ్ పై ట్రోలింగ్ జరిగింది కాబట్టి. ఇకపోతే.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్డేట్స్ అండ్ లీక్డ్ స్టిల్స్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. ఖచ్చితంగా శంకర్ మార్క్ పొలిటికల్ డ్రామాగా గేమ్ చేంజర్ ఉంటుందని మెగా ఫ్యాన్స్(mega fans) గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే తండ్రికి సంబంధించిన ఓల్డ్ లుక్ లీక్ అయి సోషల్ మీడియాను షేక్ చేసింది. అలాగే యంగ్ లుక్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్(hyderbad)లో జరుగుతోంది. చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరో కీ రోల్ ప్లే చేస్తోంది. మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో చూడాలి.