»Allu Arjun Received The Best Actor Award National Film Awards 2023
National film awards 2023: ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడి అవార్డును స్టార్ హీరో అల్లు అర్జున్ రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. దీంతోపాటు RRR చిత్రం కూడా 6 అవార్డులు గెల్చుకుంది.
allu arjun received the best actor award national film awards 2023
జాతీయ చలనచిత్ర అవార్డుల 2023(national film awards 2023) వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది అనేకమంది విజేతలు తమ అవార్డులను అందుకోవడానికి దేశ రాజధానికి ఇప్పటికే తరలివచ్చారు. ఈ సందర్భంగా పుష్ప: ది రూల్ చిత్రానికి గాను అల్లు అర్జున్(allu arjun) ఉత్తమ నటుడి అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో RRR 6 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. మరోవైపు రాకెట్రీ: నంబి ఎఫెక్ట్ నటుడు ఆర్ మాధవన్ కూడా జాతీయ అవార్డును అందుకున్నారు.
69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సంవత్సరం విభిన్న చిత్రాలు అవార్డులను గెల్చుకున్నాయి. R మాధవన్ చిత్రం Rocketry: The Nambi Effect ఈ సంవత్సరం ఉత్తమ చలన చిత్రంగా గెలుపొందగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న మొదటి తెలుగు నటుడిగా గుర్తింపు సాధించారు. పుష్ప చిత్రంలో తన నటనకు గాను అతను ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ నటి అవార్డు కోసం, గంగూబాయి కతియావాడి నుంచి అలియా భట్, మిమీ కోసం కృతి సనన్ సంయుక్తంగా విజేతగా నిలిచారు. మరోవైపు ఆస్కార్ విజేత, సంగీత స్వరకర్త MM కీరవాణి కూడా RRR మూవీ నుంచి ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం) అవార్డు అందుకున్నారు. ఈ బ్లాక్ బస్టర్ ఉత్తమ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్ టైన్ మెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. దీంతోపాటు మరికొన్ని చిత్రాలు కూడా అవార్డులను గెల్చుకున్నాయి.