»The Court Stayed The Release Of Leo Till October 20
Leo: ‘లియో’కి షాక్ ఇచ్చిన కోర్టు..20 వరకు స్టే!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా తెలుగు(leo telugu) రిలీజ్‌కు కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. అక్టోబర్ 20వరకు లియో రిలీజ్‌కు స్టే ఇచ్చింది. అసలు లియో విషయంలో తెలుగులో ఏ జరిగింది?
The court stayed the release of Leo till October 20
మాస్టర్ తర్వాత దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా.. అక్టోబర్ 19న పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. కానీ సొంత స్టేట్ తమిళనాడు(tamilanadu)లో మాత్రం లియోకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సొంత రాష్ట్రంలో ఈ సినిమాకి ఎలాంటి బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోస్‌కి పర్మిషన్ లేదని.. ఇప్పటికే తమిళనాడు కోర్టు క్లియర్ కట్‌గా చెప్పేసింది.
ఇక ఇప్పుడు లియో తెలుగు(leo telugu) థియేటర్ రిలీజ్‌ని ఆపేస్తూ.. తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి పిటీషన్ ప్రకారం.. లియో సినిమా విడుదలకి కోర్ట్ స్టే ఇచ్చింది. అసలు లియో రిలీజ్ పై కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? దీని వెనకున్న అసలు కారణం ఏంటి? అనేది తెలియదు గానీ.. లియో తెలుగు థియేటర్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశీ మరికాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి వివరించనున్నాడు.
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. లియో సినిమా తెలుగు టైటిల్ విషయంలో కోర్టు స్టే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లియో సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి ఓ రేంజ్లో బుకింగ్స్ అయ్యాయి. కానీ ఊహించని విధంగా లియో రిలీజ్ ఆపేయాలని కోర్టు స్టే ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ పడుతునే ఉంది. త్రిష(trisha) హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది.