Extraordinary man: ప్రస్తుతం టాలీవుడ్లో మారుమోగుతున్న పేరు శ్రీలీల. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తుంది. పెళ్లి సందడితో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె తన అందం, నటన, డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. నితిన్-శ్రీలీల జంటగా నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న విడుదల కానుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమైంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా శ్రీలీలపై నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. నా కెరీర్లో ఇంత మంచి పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మా నాన్న డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన మొదటి సినిమా రాజశేఖర్ నటించిన మగాడు. అది సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారు. అలా నాకు సినిమాల్లోకి రావాలనే ఇష్టం కలిగిందని తెలిపారు. ఈ రోజు ఇలా ఉన్ననంటే దానికి రాజశేఖర్ ప్రధాన కారణం. ఆయన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా చేయడం నాకు చాలా పెద్ద బహుమతి. ఇక శ్రీలీల విషయానికొస్తే రియల్ లైఫ్‌లో ఆమె ఎక్స్ట్రార్డినరీ మహిళ. ఆమెకు భరతనాట్యం, కూచిపూడి తెలుసు. రాష్ట్రస్థాయిలో ఆమె హాకీ ప్లేయర్. స్విమ్మింగ్‌లోనూ రికార్డు ఉంది. త్వరలో మెడిసిన్ కూడా పూర్తిచేయనుంది. ఇది చాలదా శ్రీలీల ఎక్స్ట్రార్డినరీ మహిళ అనడానికి అని నితిన్ అన్నారు.