»Delhi Has Not Suffered Any Damage Due To Russia S Jayashankar
Jayashankar: రష్యా కారణంగా ఢిల్లీకి ఏ నష్టం జరగలేదు!
రష్యా-భారత్ సంబంధాల వలన ఢిల్లీకి తీవ్ర నష్టం వచ్చిందని అంటున్న వార్తలపై కేంద్రమంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. ఈ రెండు దేశాల మైత్రీ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, పైగా మంచే జరిగిందని అన్నారు. ఈ బంధం ఈనాటిది కాదని గత 60 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.
Jayashankar: రష్యా-భారత్ (Russia-India) మైత్రీ ఈనాటిది కాదని, ఈ రెండు దేశాల సంబంధం వలన ఢిల్లీ(Delhi)కి ఎలాంటి నష్టం జరగలేదని భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ (S Jayashankar) అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రష్యాతో సంబంధం ఈ నాటిది కాదని, గత 50-60 సంవత్సరాలుగా కొనసాగుతోందని వెల్లడించారు. రష్యాతో మైత్రీ వలన ఢిల్లీకి నష్టం జరిగిందన్న భావన సరికాదన్నారు. ఈ స్నేహం కారణంగానే ఎన్నో సార్లు దేశానికి మంచి జరిగిందన్నారు.
గత ఏడాది నుంచి ఉక్రెయిన్-రష్యా (Ukraine-Russia) మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో భారత్ ఉక్రెయిన్‌కు మద్ధతు ఇవ్వాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. భారత్ మాత్రం స్వతంత్ర వైఖరిని ప్రదర్శించి, దేశ సౌరభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని, చర్చల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ధీమాను వ్యక్తపరిచిందని తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా దేశాలకు మింగుడుపడడం లేదని, అందుకే విషం చిమ్ముతున్నారని కేంద్రమంత్రి జయశంకర్ వ్యాఖ్యానించారు.