»Every Time You Meet The Boss Is Special Tweet By Devi Sri Prasad
Devi Sri : బాస్‌ని కలిసిన ప్రతిసారీ ప్రత్యేకమే…దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్
బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్ యూ సార్’ అని ఫోస్ట్ చేశారు.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నరాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని కలిశాడు. బాస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశాడు.టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ (Devisri prasad) ఒకరు. తన సంగీతంతో రాక్‌స్టార్‌గా, మ్యూజిక్ మిసైల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) అంటే ఎనలేని ప్రేమ, అభిమానం. సందర్భం దొరికిన ప్రతిసారీ ఆ విషయాన్ని వెల్లడిస్తుంటారు. చిన్నతనంలో చిరు గిఫ్ట్‌గా ఇచ్చిన వాచ్ గురించి ఇప్పటికీ దేవీ గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇటీవల చిరంజీవిని కలిశారు. ఉదయాన్నే చిరుని కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫొటో షేర్ చేశాడు.
సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు డీఎస్పీ. మెగాస్టార్ చిరంజీవితో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌కు మంచి అనుబంధం ఉంది. దేవిశ్రీలో ప్రతిభను గుర్తించిన చిరు.. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం(Shankar Dada MBBS Movie)లో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి వెనుదిరి చూడని డీఎస్సీ సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగారు. చిరుతో చాలా సినిమాల్లో పని చేసి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ మధ్యే వాల్తేరు వీరయ్య(Waltheru Veeraya)లో డీఎస్సీ ట్యూన్స్ ను చిరు వేసిన స్టెప్పులు అభిమానులను ఎంతగానో అలరించాయి.
బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్ (Breakfast). అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్ యూ సార్’ అని ఫోస్ట్ చేశారు. ఫొటో తీసిన చిరు కూతురు కొణిదెల సుస్మితకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, చిరు, డీఎస్పీ భేటీ అయ్యింది కేవలం బ్రేక్ ఫాస్ట్ కోసమేనా? మరేదైనా ప్రత్యేకత ఉందా? అని అభిమానులు ఆతృతగా ప్రశ్నిస్తున్నారు. తన తదుపరి సినిమాలోనూ డీఎస్పీకి చిరు చాన్స్ ఇచ్చారని, మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే కలిశారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’(Bhola Shankar) సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు దేవీ శ్రీ ప్రసాద్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, అల్లు అర్జున్ ‘పుష్ప.. ది రూల్’కు సంగితం అందిస్తున్నారు.