నటుడు రాఘవ లారెన్స్ సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన.. తన తొలి ఇంటిని పేద పిల్లల కోసం ఫ్రీ స్కూల్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇల్లు తనకు ఎంతో స్పెషల్ అని, తాను డ్యాన్స్ మాస్టర్‌గా సంపాదించిన డబ్బుతో కొన్న మొదటి ఇల్లు అని అన్నారు. తర్వాత దాన్ని అనాథాశ్రమంగా మార్చినట్లు, ఇప్పుడు పిల్లల విద్య కోసం అంకితం చేస్తున్నట్లు తెలిపారు.