ఏవిషయంలోనైనా ధైర్యంగా ముందడుగు వేసి రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని హీరోయిన్ సమంత చెప్పారు. ఈ విషయాన్ని తాను బలంగా చెబుతానని అన్నారు. తమని తాము నమ్మినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. దూరదృష్టి ఉన్న ప్రతి మహిళ నలుగురిలోకి వచ్చి తన ఆలోచనలను చెప్పాలని, ఎందుకంటే ప్రపంచం వారి నాయకత్వాన్నే కోరుకుంటోందని పేర్కొన్నారు.