»Dhanush In A Stunning Look For Captain Miller Video Goes Viral
Dhanush: ‘కెప్టెన్ మిల్లర్’ కోసం అదిరిపోయే లుక్‌లో ధనుష్..వీడియో వైరల్
కెప్టెన్ మిల్లర్(Captain Miller) ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
వైవిధ్యభరిత సినిమాలు చేసే హీరో ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్(Captain Miller) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం ధనుష్(Dhanush) తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అరున్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా కోసం ధనుష్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డం పెంచి ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.
తాజాగా నేడు ముంబై ఎయిర్‌పోర్టులో హీరో ధనుష్(Dhanush) షాకింగ్ లుక్‌లో కనిపించాడు. న్యూ లుక్‌లో ఉన్న ధనుష్‌తో ఎయిర్‌పోర్టు సిబ్బంది సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెప్టెన్ మిల్లర్ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ వంటివారు కీలక పాత్రలో నటిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్(Captain Miller) ఫస్ట్ లుక్‌ను జూన్‌లో, టీజర్‌ను జులైలో లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.