ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ బ్రేక్‌లో ఉంది. విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌కు షూటింగ్ గాయాలు అవడంతో.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. కానీ.. ఈ సినిమాలో ఉండే ఆయుధ పూజ మాత్రం మామూలుగా ఉండదట.
Devara: వాస్తవానికైతే.. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ పై లాస్ట్ షెడ్యుల్లోనే క్లైమాక్స్ షూట్ చేయాల్సి ఉంది. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల షూటింగ్ ఆగిపోయింది. అయితే.. ఇప్పుడు సైఫ్ షూటింగ్‌కు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ పోర్షన్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మార్చి రెండో వారం నుంచి ‘దేవర’ షూట్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ మార్చి రెండో వారం నుంచి డేట్స్ ఇచ్చాడని టాక్. ఇదిలా ఉంటే.. దేవరకు సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
దేవరలో వచ్చే ఓ హై ఓల్టేజ్ సాంగ్ థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉంటుందట. విలన్ల ఊచకోతకు ముందు వచ్చే ఈ ఆయుధ పూజ సాంగ్ సినిమాకి హైలైట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సాంగ్‌ను మామూలుగా కంపోజ్ చేయలేదట. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సాంగ్ కోసం సెట్ వర్క్ చేస్తున్నారట. విజువల్ పరంగా కూడా ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని అంటున్నారు.