తాజాగా శ్రీకాంత్ ఓదెల్(Director Srikanth Odela) పెళ్లిపీటలెక్కి ఓ ఇంటివాడయ్యడు. బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పి వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోదావరి ఖనిలో శ్రీకాంత్ ఓదెల పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది.
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కిన సినిమా దసరా(Dasara Movie). ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Odela) దర్శకత్వం వహించారు. ఒక్క సినిమాతోనే ఈ కుర్ర డైరెక్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. సుకుమార్(Sukumar) శిష్యుడిగా గుర్తింపు పొందిన శ్రీకాంత్ ఓదెల తన కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రెండో సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు.
తాజాగా శ్రీకాంత్ ఓదెల్(Director Srikanth Odela) పెళ్లిపీటలెక్కి ఓ ఇంటివాడయ్యడు. బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పి వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోదావరి ఖనిలో శ్రీకాంత్ ఓదెల పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది. దర్శకులు సుకుమార్(Sukumar), అనుదీప్ సహా సినీ ప్రముఖులు ఆ పెళ్లిలో సందడి చేశారు. అయితే హీరో నాని మాత్రం ఆ పెళ్లికి హాజరుకాలేకపోయాడు.
ఓ సినిమా షూటింగ్ సందర్భంగా పూణెలో ఉన్న నాని(Nani) తన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను ఆశీర్వదిస్తూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియా వేదికగా శ్రీకాంత్ ఓదెల(Director Srikanth Odela) దంపతుల ఫోటోను షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు. దీంతో నెట్టింట నాని పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా శ్రీకాంత్ ఓదెల తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే ఓ బడా హీరోతోనే తన తర్వాతి ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.