NLG: దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో అన్నం రెండోసారి పెట్టుకున్న విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టిన ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడ భోజనం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు డివిజన్ అధ్యక్షుడు జగన్ నాయక్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.