మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయినా ఇప్పటి వరకు ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. దాంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే ఇప్పుడు గట్టిగా ప్రమోషన్స్ చేసేందుకు రంగంలోకి దిగింది గాడ్ ఫాదర్ టీమ్. ఈ సందర్భంగా ఓ డైలాగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగాస్టార్. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్ పోస్ట్ చేశారు. ఇది సినిమాకు సంబంధించిన డైలాగే అయినా.. చిరు రియల్ పొలిటికల్ లైఫ్‌కు దగ్గరగా ఉండడంతో వైరల్‌గా మారింది.
ఇక ఈ ప్రమోషన్లో భాగంగా.. భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య హైదరాబాద్, విశాఖ పట్టణం, రాజమండ్రితో పాటు రాయలసీమలో కూడా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ క్రమంలో ఈ నెల 28న ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో జరిపేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే గాడ్ ఫాదర్లో గెస్ట్లో రోల్ చేసిన సల్మాన్ ఖాన్.. ఈ ఈవెంట్‌కు వస్తాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవన్, సల్మాన్ వస్తే మాత్రం.. గాడ్ ఫాదర్ ఈవెంట్ దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పొచ్చు.