యంగ్ హీరో కార్తీక్ రత్నం(Karthikratnam) నటిస్తున్న చిత్రం ఛాంగురే బంగారురాజా(Changure Bangaru Raja Movie). మాస్ మహారాజ రవితేజ హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటిస్తోంది. క్రైమ్ కామెడీ(Crime Comedy) నేపథ్యంలో ఛాంగురే బంగారురాజా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్(Teaser Release) చేశారు.
‘ఛాంగురే బంగారు రాజా’ మూవీ టీజర్ :
సునీల్(Hero Sunil) వాయిస్ తో సాగుతున్న ఈ టీజర్ (Teaser)లో కొంచెం ఫన్, కొంచెం సీరియస్ ఎలిమెంట్స్ ఉన్నట్లు చూడొచ్చు. ఈ సీన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సడెన్ గా ముగ్గురు తన జీవితంలోకి ఎంటరైపోయి సుఖంగా ఉన్న తన జీవితాన్ని కలగాపులగం చేసేశారని సునీల్ వాయిస్ వినిపిస్తుంది.
బంగార్రాజు, తాతారావు, గాటిల్ చుట్టూ ఈ మూవీ సాగుతుందని టీజర్ (Teaser)ను చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీకి రచన, దర్శకత్వం సతీష్ వర్మ. ఛాంగురే బంగారు రాజా మూవీకి కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీకి జనార్దన్ పసుమర్తి స్క్రీన్ ప్లే అందించాడు. సత్య, రవిబాబు, ఎస్తేర్ నోరోన్హా, అజయ్ వంటివారు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.