Case 30 Movie Explained: సెప్టెంబర్ 30 2019 మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, వర్షం పడుతుండగా ఒక వ్యక్తి బ్యాక్ షాట్ నుంచి సీన్ ఓపెన్ అవుతుంది. అతను అలా నడుచుకుంటూ వెళ్లి ఒక డోర్ ను కొడుతాడు. ఒక అమ్మాయి ఓపెన్ చేస్తుంది. అతన్ని చూసి భయపడుతుంది. తనవెైపే వెళ్తుంటాడు కిల్లర్, తాను చేయి పెడుతుంది తన చేయిని కత్తితో కోస్తాడు. తరువాత తనను కింద పడేస్తాడు. తలపై కొడుతాడు. వెళ్లి కుర్చిలో కూర్చొంటాడు. కట్ చేస్తే అతని ఫేస్ నుంచి మ్యాచ్ కట్ లో పోలీసులు ఆఫీసర్ అర్జున్ కనిపిస్తాడు. మర్డర్ ఇలానే జరిగి ఉంటుంది అని కానిస్టేబుల్ మూర్తితో చెప్తాడు. ఇది ఆ పోలీసు ఆఫీసర్ కు 30 వ కేసు అని మూర్తి అనగానే టైటిల్ పడుతుంది.
తరువాత కేసు ఇన్వెస్ట్ గేషన్ లో భాగంగా ఇంటి పక్కన ఉండే భాస్కర్ ను పిలిచి అడుగుతారు. తన పాప బర్త్ డే పార్టీ కోసం ఇన్వైట్ చేయడానికి వచ్చి మర్డర్ జరిగినట్లు వాళ్ల పాప చెప్పిందని చెప్తాడు భాస్కర్. చనిపోయిన అమ్మాయి పేరు శ్వేత అని తనతో ఒక అబ్బాయి కూడా ఉండేవాడని చెప్తాడు.. తరువాత ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫయిల్స్ తనకు ఇవ్వాలని కానిస్టేబుల్ నాయుడికి చెప్పి అక్కడినుంచి బయలు దేరుతాడు అర్జున్.
చదవండి:Bobby Deol: సినిమా లేనట్టే.. ‘హరిహర వీరమల్లు’ విలన్ కామెంట్స్ వైరల్!
తరువాత సీన్లో అర్జున్ పడుకొని ఉంటాడు. ఒక్క సారిగా నిద్రనుంచి లేస్తాడు. కాసేపు ఊపిరి తీసుకుంటాడు. డోర్ బెల్ కొట్టిన సౌండ్ వచ్చి టీ షర్ట్ వేసుకొని డోర్ తీస్తాడు. వచ్చింది నాయుడు. శ్వేత బాయ్ ఫ్రెండ్ సిరిల్ అని అతనికి చాలా ఆస్తి ఉందని, తనది చెన్నై అని చెప్తాడు. సిరిల్ ఆఫీస్లో ఇచ్చిన ఇంటి అడ్రస్, శ్వేత ఇంటి అడ్రస్ వేరు అని చెప్తాడు. దాంతో సిరిల్ ఇంటికి వెళ్తారు. డోర్ కొడితే ఒక అతను డోర్ ఓపెన్ చేసి తన పేరు సిరిల్ అని చెప్తాడు. ఇంట్లోకి వెళ్లి అతన్ని క్వశ్చన్స్ అడగడం మొదలు పెడుతారు. స్వేత చనిపోయిన అప్పటినుంచి ఎక్కడి వెళ్లావు అంటే తాను ట్రిప్ కు వెళ్లినట్లు చెప్తాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయినట్లు చెప్తాడు. అలాగే శ్వేతతో 3 ఇయర్స్ గా రిలేషన్ షిప్ లో ఉన్నానని, తన బిహేవియర్ నచ్చలేదని, ప్రతి దానికి చిరాకు తెప్పిస్తుందని, లైఫ్ లాంగ్ తనతో హ్యప్పిగా ఉండలేనని తన పేరెంట్స్ చూసిన మ్యచ్ ఓకే చేసినట్లు చెప్తాడు. అందుకే ఆఫీస్ 15 డేస్ బ్యాకే లీవ్ పెట్టినట్లు చెప్తాడు. తాను ఈ కేసులో ప్రైమరీ సస్పెక్ట్ వి అని పోలీసులకు చెప్పకుండా ఎక్కడి వెళ్లోద్దు అని అర్జున్ చెప్పి అక్కడి నుంచి బయటకు రాగానే అర్జున్ కు ఫోన్ వస్తుంది.
తరువాత సీన్లో అర్జున్ తన ఆఫీసర్ అజయ్ తో కేసు గురించి మాట్లాడుతాడు. ఈ కేసు తొందరగా ఫినిష్ అయ్యేలా వర్క్ చేయి అని చెప్తాడు అజయ్. తరువాత సీన్లో అర్జున్ బిల్డింగ్ పైన ఉండి ఏదో ఆలోచిస్తుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో తన గర్ల్ ఫ్రెండ్ తనకు వాచ్ ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటాడు. అదే టైమ్ లో అక్కడికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. కేసు గురించే కాదు నీ హెల్త్ గురించి కూడా ఆలోచించు, నా గురించి కూడా ఆలోచించు అని చెప్తుంది. కట్ చేస్తే ఇది కూడా తాను ఊహించుకుంటాడు. తరువాత సీగరేట్ తాగుతూ ఆలోచిస్తాడు.
నెక్ట్స్ సీన్లో కార్లో ఆఫీస్ కు వెళ్లి శీలాను అడిగి ఫైల్ తీసుకుంటాడు. అదే సమయంలో ఒకడు పోలీసు డ్రెస్ వేసుకొని ఫ్రాంక్ చేస్తున్నాడని అతన్ని చెంపమీద కొడుతాడు. అక్కడి నాయుడు వచ్చి అర్జున్ తో మాట్లాడుతాడు. రాత్రి ఇద్దరు డ్రంక్ డ్రైవ్ లో ఒక ముసలి వాడిని ఢీ కొట్టి పారిపోతే తీసుకొచ్చామని చెప్తాడు. తరువాత ఎందుకు తాగవు అని అడిగితే తన గర్ల్ ఫ్రెండ్ కు పెళ్లి అయిందని బాధతో తాగనని చెప్తాడు. తరువాత ముసలి వాడిని చూసుకునే బాధ్యత వాళ్లకు చెప్పి వెళ్లిపో అంటాడు అర్జున్. సిరల్ కాల్ చేసి స్టేషన్ కు రమ్మన్నాని నాయుడికి చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో అభి ఏదో టెన్షన్ లో కూర్చొని ఉంటాడు. అక్కడి ఒక పర్సన్ వచ్చి సర్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. వాళ్ల సర్ దగ్గరికి వెళ్లి తన హెల్త్ బాగాలేదని 5 డేస్ లీవ్ కావాలని చెప్తాడు అభి. దాంతో లీవ్ ఇస్తా కాని సాలరీ అడగకు అని పంపిస్తాడు. తరువాత సీన్లో అర్జున్ దగ్గరకు సిరిల్ వస్తాడు. శ్వేత వాళ్ల పేరెంట్స్ గురించి అడిగితే తెలియదు అని చెప్తాడు. దాంతో నాయుడు అర్జున్ గురించి చెప్పి నిజం చెప్పు అని అంటాడు. తనతో ఎప్పుడు పేరెంట్స్ గురించి అడిగినా చెప్పేది కాదని అంటాడు. కాని తాను సెయింట్ పాట్రిక్స్ స్కూల్ చదివింది అని చెప్తాడు. కట్ చేస్తే ఇద్దరు ఆ స్కూల్ కు వెళ్తారు.
అక్కడ ఒక నన్ ని ప్రిన్స్ పాల్ గారిని కలువాలని, వాళ్ల అబ్బాయి అడ్మిషన్ గురించి మాట్లాడలని చెప్తాడు అర్జున్. పైకి వెళ్లి ప్రిన్సిపల్ తో అర్జున్ క్రైమ్ బ్రాంచ్ అని పరిచయం చేసుకుంటాడు. శ్వేత ఫోటో చూపించి తన గురించి అడుగుతాడు. శ్వేత గురించి తెలుసని ప్రిన్సిపల్ చెప్తుంది. శ్వేత వాళ్లది విజయవాడ అని, తన మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ అని, తాను పెద్దగా ఎవరితో ఉండేది కాదని, తాను ఎప్పుడు ఏదో ట్రాన్స్ లో ఉండేది, తనకు నచ్చింది తన దగ్గరే ఉండాలి అని, ఎవరన్నా తీసుకున్నా ఊరుకునేది కాదని, నిద్రలో లేచి అరిచేది అని చెప్తుంది. ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్తే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్కూల్ అయిపోయిన తరువాత తాను ఎక్కడ ఉంటుందో తెలియదు అని చెప్తుంది.
శ్వేతను ఎవరో మర్డర్ చేశారు అని అర్జున్ చెప్తాడు. దాంతో ప్రిన్సిపల్ కాస్త షాక్ గురవుతుంది. ఈ కేసులో మీ హెల్ప్ కావాలి అని అడిగ్గానే తన పేరెంట్స్ గురించి తెలియదు కాని, తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలుసని అతని విజిటింగ్ కార్డు ఇస్తుంది. అది తీసుకొని అర్జున్, నాయుడు థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతారు.
తరువాత సీన్లో టీ తాగుకుంటూ ఆలోచిస్తారు. ప్రిన్స్ పల్ చెప్పిన విషయం నమ్మడం కొంచె కష్టాంగానే ఉన్నా ఈ కేసులో దేన్ని అయినా నమ్మాలి అని మాట్లాడుకుంటారు. అదే సమయంలో అక్కడ ఒక వ్యక్తి తన లవర్ పై ఫోన్ లో అరుస్తుంటాడు. విషయం ఏంటని అడిగుతాడు అర్జున్.. నాలుగేళ్లు ప్రేమించిన అమ్మాయి కాలేజీ అయిపోగానే ఇంటికి పోయి పూర్తిగా మారిపోయింది. తనకు ఫారెన్ మ్యాచ్ వచ్చిందట, ఇప్పుడు నీకేముంది అంటుంది అని చెప్తాడు. దాంతో అర్జున్ ఆలోచనలో పడుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో తన గర్ల్ ఫ్రెండ్ రెడీ అవుతుంది. అర్జున్ కూడా రెడీ అయి వస్తాడు. ఇద్దరు కలిసి ఈవెంట్ కు వెళ్తున్నట్లు మాట్లాడుకుంటారు. తరువాత ఇద్దరు రోమాంటిక్ గా మాట్లాడుకుంటారు. రోమాంటిక్ సాంగ్ మొదలౌతుంది. ఇద్దరి ఇంటిమేట్ సీన్.. కట్ చేస్తే ఇద్దరు బెడ్ పైనే ఉండి మాట్లాడుకుంటారు. నేను దూరం అయితే ఏం చేస్తావు అని అడుగుతుంది. ఈ డౌట్ ఎందుకు వచ్చింది, కొంపదీసి వదిలేసిన వెళ్లిపోతావా ఏంటి అని అంటాడు అర్జున్.. దానికి ఎప్పటికి నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను అని చెప్తుంది. కట్ చేస్తే అర్జున్ టెన్షన్ పడుతూ కారు దిగుతాడు. నాయుడు వాటర్ బాటిల్ అందిస్తాడు. తాగిన తరువాత బయలు దేరుతారు.
నెక్ట్స్ సీన్లో ఒక హోటల్ లో రూమ్ తీసుకుంటారు. అర్జున్ ఫ్రెష్ అవుతాడు. అజయ్ సర్ కాల్ చేస్తే అతనితో విజవాడకు వచ్చినట్లు సైకాట్రిస్ట్ ను కలువబోతున్నట్లు చెప్తాడు. తరువాత సీన్లో డాక్టర్ ప్రశాంత్ గారిని మీట్ అవ్వలని చెప్తాడు. రిసెప్షన్ డాక్టర్ కు కాల్ చేసి చెప్తుంది. వాళ్లు డాక్టర్ తో మాట్లాడుతారు. శ్వేతకు ట్రీట్ మెంట్ పూర్తిగా జరగలేదని, ఒక డాక్టర్ గా తనను పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నించానని, తరువాత శ్వేత రెస్పాండ్ అవలేదని చెప్తాడు. ఇక తనకు థూరానికల్ శాడిసమ్ అనే డిసీజ్ ఉందని, అది ఉన్న వాళ్లు తనకు నచ్చింది, తనకు కావల్సింది ఇవ్వకపోతే చంపేవరకు కూడా వెళ్తారు అని చెప్తాడు. ఒక చిన్నపాటి సైకో కిల్లర్ మెంటాలిటీ అని వివరిస్తాడు. శ్వేత వాళ్ల నాన్న డిటైల్స్ తీసుకొని అక్కడి నుంచి బయలు దేరుతారు.
నాయుడు, అర్జున్ ఇద్దరు కార్లో బయలుదేరుతూ మాట్లాడుకుంటారు. శ్వేత ఫాదర్ దగ్గరకు వెళ్తున్నట్లు అర్జున్ చెప్తాడు. దాంతో శ్వేత గురించి అందరు చెప్పినట్లే తన తండ్రి కూడా చెప్తాడేమో అని నాయుడు అంటాడు. ఫ్లాష్ బ్యాక్ సీన్లో మరో మర్డర్ జరుగుతుంది. అక్కడికి పోలీసులు మీడియా వెళ్తుంది. వారం తిరగకుండానే మరో యువతిని మర్డర్ చేసినట్లు, ఇంతకీ ఈ మర్డర్లు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని మీడియా ప్రశ్నలు వేస్తుంది. ఇదే న్యూస్ ను ఆఫీసర్ వేద చూస్తుంది. తనకు ఫోన్ వస్తుంది. కట్ చేస్తే ఏపీ ఫారెన్సిక్ డిపార్ట్ మెంట్ లో డాక్టర్స్ తో మాట్లాడుతుంటారు. తనను చాలా బ్రూటల్ గా రేప్ చేసి చంపారు అని డాక్టర్ చెప్తుంది. ఒక ఫార్మాకంపెనీ సీఈఓ కొడుకుది అని అతనితో పాటు మరో ఇద్దరు గోవాకు వెళ్లి వస్తుండుగా దారిలో ఇలా చేసి ఉంటారని వేద చెప్తుంది. అదే సమయంలో వేదకు ఫోన్ వస్తుంది. ఆ ముగ్గిరిలో ఒకడి ఫోన్ ఆన్ అయిందని, ఆ లోకేషన్ ట్రేస్ అయిందని చెప్తుంది. దాంతో అర్జున్ వారికోసం వెళ్తున్నట్లు ఆ నెంబర్ ను ట్రేస్ చేసి, ఏ కాల్ వచ్చినా తనకు చెప్పమని, ఈ విషయం మీడియాకు అస్సలు తెలియద్దు అని చెప్తాడు.
తరువాత ఒక గ్యాంగ్ సీన్లో వారు బీర్లు తాగుతూ గేమ్ ఆడుకుంటారు. అక్కడికి అర్జున్ టీమ్ ఎంటర్ అవుతుంది. ఒక అపార్ట్ మెంట్ లోకి వెతుక్కుంటూ వెళ్తారు. అదే సమయంలో అర్జున్ కు కాల్ వస్తుంది. పోలీసుల వచ్చారని అక్కడ దాక్కున్న గ్యాంగ్ పరుగెత్తుతారు. వారిని ఛేజ్ చేసి పట్టుకొని వారితో ఫైటింగ్ చేస్తారు పోలీసులు. అదే సమయంలో అర్జున్ కు ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే నిత్య ఫోన్ చేస్తుంది. ఏ టైమ్ లో ఫోన్ చేయాలో తెలియదా అని అరుస్తాడు. దాంతో నిత్య బాధ పడుతుంది. కట్ చేస్తే అర్జున్, నాయుడు కారుదిగి డోర్ కొడుతారు. వర్మ మీరేనా అని అర్జున్ ను పరిచయం చేసుకుంటాడు. మీ అమ్మాయి శ్వేత గురించి మాట్లాడడానికి వచ్చాను చెప్పి ఇంట్లో కూర్చుకుంటారు. శ్వేత చనిపోయిన విషయం తండ్రికి చెప్తాడు. అదే సమయంలో అక్కడికి శ్వేత తల్లి వస్తుంది. తరువాత వర్మ అర్జున్ ను బయటకు తీసుకెళ్లి మాట్లాడుతాడు. శ్వేత తల్లి చిన్నప్పుడే మరణించింది, తన గురించి ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా అని అదే తాను చేసిన తప్పు అని చెప్తాడు. అప్పటి నుంచి తనతో సరిగా మాట్లాడేది కాదని, ఎప్పుడూ డోర్ వేసుకొని ఉండేది అని అందుకే తనను స్కూల్ లో వేసినట్లు చెప్తాడు. అక్కడ కూడా తన ప్రవర్తన బాలేదని, డాక్టర్ కూడా సంప్రదించానని, తరువాత తనకు డ్రగ్స్ అలవాటు అయ్యాయి అని చెప్తాడు. ఒక సారి తన భార్యను శ్వేత చంపడానికి కూడా ట్రై చేసింది అని చెప్పి ఏడుస్తాడు.
ఇన్నాళ్లు శ్వేత ఎక్కడుందో తెలియదు, కాని ఇక్కడ ఉన్నప్పుడు తనకు ఒక వ్యక్తి కలిసి డ్రగ్స్ ఇచ్చేవాడని చెప్తాడు. అతను ఎలా ఉంటాడు అని అడగుతాడు అర్జున్. అతని గురించి చెప్పే లోపే ఒక వ్యాన్ వచ్చి ఇద్దరిని ఢీ కొడుతుంది. వర్మ కింద పడిపోతాడు. అర్జున్ లేచి ట్రక్ నే చూస్తూ ఉంటాడు. ఇంటర్ మిషన్.
తరువాత సీన్లో వర్మకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. బయట అర్జున్ వర్మ భార్య వెయిట్ చేస్తుంటారు. అక్కడికి డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్, బ్రైన్ లో బ్లడ్ క్లాట్ అయితే ట్రీట్ మెంట్ చేశాము. అతనికి సృహ రావడానికి 8 డేస్ పడుతుందని, షాకింగ్ విషయాల నుంచి అతన్ని కాపాడుకోవాలి అని చెప్తాడు. అర్జున్ కు దండం పెట్టి మమ్మల్ని ఏమి అడుగొద్దు అని చెప్తుంది వర్మ భార్య. తరువాత పోలీసు వచ్చి అది ఒక కొరియర్ వెహికిల్ తాగి డ్రైవ్ చేయడం వలనే ఇలా జరిగింది అని చెప్తాడు. దాంతో ఇక కేసుకు మనం గుడ్ బై చెప్పినట్లేనా అని నాయుడు అడుగుతాడు.
తరువాత సీన్లో అర్జున్ డోర్ కొట్టగానే నిత్య డోర్ తీసి వెంటనే మూసివేస్తుంది. తాను అలా అరిచినందకు సారీ చెప్తాడు. అయినా తీయదు, సర్ ప్రైజ్ ఇస్తాను అంటాడు. దాంతో డోర్ తీస్తుంది. తరువాత ఇద్దరు హగ్ చేస్తుకుంటారు. నిత్య బర్త్ డే అరెంజ్మెంట్స్ చేస్తుంది. కేక్ కట్ చేసి తనకు తినిపిస్తాడు. తరువాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఏంటి సర్ ప్రైజ్ అని అడిగితే రేపు బయటకు పోదాము అని అర్జున్ అంటాడు. సాంగ్ స్టార్ట్ అవుతుంది. పాట అయిపోయిన తరువాత ఇంటికి వస్తారు. అర్జున్ కు అజయ్ సర్ ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే వారు అరెస్ట్ అయిన నలుగురిని వదిలేయాలని పై నుంచి వత్తిడి వస్తుందని, వారు బిగ్ షాట్స్ పిల్లలు అని వారి ప్లేస్ లో వేరే ఎవరినో ఇరికించండి అని చెప్తున్నారు అని అజయ్ చెప్తాడు. దాంతో వదిలేద్దాం సర్ అంటాడు అర్జున్. డైరెక్ట్ గా వదిలేస్తే మీడియాతో ప్రాబ్లమ్ వస్తుంది అని సీన్ రీ కన్ స్ట్రక్షన్ అని చెప్తాడు.
వారిని తీసుకొని అమ్మాయి రేప్ చేసిన ప్లేస్ కు తీసుకెళ్తారు. వాళ్లు అమ్మాయిని తరుముతుంటారు. అమ్మాయి భయంతో పరుగెత్తుతుంది. అమ్మాయి నాలిక ఎందుకు కట్ చేశారు అంటే బూతులు తిట్టింది అని చెబుతారు. చనిపోయిన తరువాత కూడా ఎందుకు రేప్ చేశారు అంటే ముందు ఇద్దరు చేయగానే చనిపోయింది, ఆ తరువాత వీరిద్దరు చేశారు అని చెప్తారు.
వేదకు వారి హ్యండ్ కప్స్ తీయమంటాడు అర్జున్. తరువాత వారిని పారిపొమ్మంటాడు. వాళ్లు అలా పొగరుగా నడుచుకుంటు వెళ్తుంటే అందరిని ఎన్ కౌంటర్ చేస్తాడు అర్జున్ . ఇదే విషయం మీడియాలో చెప్తారు. ఈ విషయంపై ప్రజలు పొగుడుతుంటారు.
తరువాత సీన్లో అర్జున్ ను ఒక టెన్ డేస్ విజయవాడకు పంపిస్తున్నట్లు అజయ్ చెప్తాడు. తరువాత నిత్యను కలువడానికి రెస్టారెంట్ కు వెళ్తాడు. అదే సమయంలో అజయ్ ఫోన్ చేస్తాడు. అర్జున్ ను విజయవాడకు పంపిస్తున్నట్లు చెప్తాడు. దానికి కొపంతో ఫోన్ కట్ చేస్తుంది. తరువాత ఇంకో ఫోన్ వస్తుంది. నిత్యను తీసుకొని వెళ్తాడు అర్జున్.
మరో సీన్లో ఒక మర్డర్ జరుగుతుంది. అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అక్కడికి అర్జున్ వస్తాడు. ఆ మర్డర్ ను చూసి హోటల్ మేనజర్ తో మాట్లాడుతాడు. తరువాత క్లూస్ టీమ్ తో మాట్లాడుతాడు. ఒక లేడీస్ హ్యండ్ బ్యాగ్ మాత్రమే దొరికింది అని చెప్తాడు. అంతలో అర్జున్ కు ఫోన్ వస్తుంది. విజవాడకు బయలు దేరుతాడు. తరువాత సాంగ్ వస్తుంది.
నిత్య అర్జున్ హ్యప్పిగా ఉన్న మూమెంట్స్ ను గుర్తు చేసుకుంటాడు అర్జున్. నిత్య క్యాలెండర్లో డేట్స్ ను లెక్కపెడుతూ ఉంటుంది. పాట అయిపోతుంది. నిత్యకు ఫోన్ చేస్తాడు అర్జున్. బర్త్ డే పార్టీకి వెళ్తున్నట్లు చెప్తుంది. తాను కూడా విజయవాడ నుంచి బయలు దేరినట్లు చెప్తాడు.
ఫ్లాష్ కట్ లో అర్జున్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. తరువాత సీన్లో నాయుడికి ఫోన్ చేసిన శ్వేత మర్డర్ జరిగే ముందు ఆ ఇంటికి ఇక కొరియర్ బాయ్ వచ్చాడు వాన్ని పట్టుకుంటే ఏదైనా ఇన్ఫార్మెషన్ దొరకిచ్చు అని చెప్తాడు. కట్ చేస్తే అభి గురించి అడుగుతాడు అర్జున్. అంతలో కొరియర్ ఆఫీస్ కు అభి వస్తాడు. పోలీసులను చూసి పారిపోతాడు. అతన్ని వెంబడించి పట్టుకుంటాడు అర్జున్. పోలీసుస్టేషన్ లో ఇంట్రాగేట్ చేస్తుంటారు. అతనికి ఏం తెలియదు అని చెప్తాడు. నోట్లో గన్ పెట్టగానే ఆ మర్డర్ నేను చేయలేదు సర్ అని చెప్తాడు. నిజం చెప్పు అని గట్టిగా అరిస్తాడు అర్జున్.. ఆ రోజు వర్షం పడుతుంది. ఒక ఆర్డర్ ఇవ్వడానికి శ్వేత ఇంటికి వెళ్లానని, ఎవరో తనను లాక్కుల్లేరని అది చూసినందుకు.. అతను తనను కూడా బెధిరించాడని చెప్తాడు. అందుకే పోలీసుల చూసి పారిపోయినంటాడు. అతనికి సిరల్ ఫోట్ చూపిస్తాడు.. అభి కాదు అంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్ ను పిలిపిస్తారు. అభి చెప్తుంటాడు. అతను గీస్తుంటాడు. ఫైనల్ గా బొమ్మ కంప్లీట్ అవుతుంది. అతను ఎవరో కాదు డ్రంక్ డ్రైవ్ కేసులో పోలీసు స్టేషన్ వచ్చింది వీల్లేనని గుర్తు పడుతారు.
అతను ఇచ్చిన అడ్రస్ రాంగ్ అని, అతని మొబైల్ నెంబర్ తో ఇక అడ్రస్ ట్రేస్ అయినట్లు చెప్తాడు నాయుడు. అర్జున్ ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ డ్రగ్స్ ఉంటాయి. అది చూస్తుండగా అతను వెనక నుంచి రాడ్ తో కొడుతాడు ఆ కిల్లర్. తరువాత ఇద్దరి మధ్య ఫైట్ జరుగుంది. తనను ఎందుకురా చంపావు అని అడుగుతాడు. శ్వేతను చంపింది నేను కాదు అంటాడు కిల్లర్. నేనే అడిగిది శ్వేత గురించి కాదు నిత్య గురించి అంటాడు. నిత్య ఎవరో తెలియదు అంటాడు కిల్లర్. శ్వేత అంత చెప్పింది అని అర్జున్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
నిత్యకోసం అర్జున్ వెళ్తాడు. అక్కడ శ్వేత ఉంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతుంది. నిత్య గురించి చెప్తాడు. వర్షంలో నిత్య కారు ఆగిపోతుంది. కారు స్టార్ట్ అవకపోవడంతో అక్కడే ఉండిపోతుంది. అక్కడికి మరో కారు వచ్చి ఆగుతుంది. కార్లోంచి సిరిల్ దిగి కారు చెక్ చేస్తాడు. ప్రాబ్లమ్ పెద్దగా ఉంది అని నా రూమ్ పక్కనే ఉంది అని, మీకు ప్రాబ్లమ్ లేకుంటే అక్కడికి రావచ్చు అని చెప్తాడు. దాంతో నిత్య సిరల్ తో వెళ్తుంది. కారు ఇంటిదగ్గర ఆగుతుంది. ఇంట్లోకి ఇద్దరు వెళ్తారు. నిత్య రూమ్ ను చూస్తూ ఉంటుంది. సిరిల్ ఫ్రెష్ నిత్యకు టవల్ ఇచ్చి శ్వేత డ్రెస్ ఇస్తాడు. తాను మార్చుకుంటుంది. తరువాత సిరిల్ కాఫీ పెడుతాడు. ఇద్దరు తాగుతుండగా అక్కడికి శ్వేత వస్తుంది. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడం చూస్తుంది. అపార్థం చేసుకుంటుంది. తాను ఎవరు, నా డ్రెస్ ఎందుకు ఇచ్చావు అని మాట్లాడుతుంది. కోపంగా రూమ్ లోకి వెళ్లిపోతుంది.
శ్వేత పొసెస్సీవ్ గా బిహేవ్ చేస్తుంది. అతనికి బెంగళూర్ లో క్లయింట్ మీటింగ్ ఉందని వెళ్తాడు. నిత్య టీవీ చూస్తుంది. అక్కడికి శ్వేత వస్తుంది. నిత్య ఏం మాట్లాడినా శ్వేత పెద్దగా రెస్పాండ్ అవదు. సిరిల్ మంచి వాడు నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. నువ్వు లక్కి అంటుంది. మనం ఇద్దరం బాయ్ ఫ్రెండ్స్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుందామా అంటుంది. దానికి శ్వేత పని ఉందని వెళ్లిపోతుంది. తన బెడ్ రూమ్ లో నిత్య డ్రెస్ చూసి శ్వేత చికాగా ఫీల్ అవుతుంది. తన కంట్రోల్ తప్పుతుంది. అదోలా ప్రవర్తిస్తుంది.
నిత్య అర్జున్ కు ఫోన్ చేసి జరిగింది అంతా చెబుతుంది. అదే సమయంలో శ్వేత టెన్షన్ పడుతుంది. డ్రగ్స్ ఎక్కించుకుంటుంది. మరో సీన్లో నిత్య అర్జున్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుంది. అక్కడ బ్యాగ్ ను చూసిన అర్జున్ తనను అక్కడి నుంచి వెళ్లిపో అని అంటాడు. నిత్యకు ఏం జరిగిందో అర్థం కాదు. మళ్లీ వెళ్లిపో అని చెప్పేసరికి నిత్య బయటకు వెళ్తుంటే శ్వేత కత్తితో తనను పొడుస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ ను నీకు ఇచ్చేయాలా అని పొడుస్తుంది. అర్జున్ ఫోన్ ట్రైస్తుంటాడు. అది రీచ్ కాదు. వెంటనే కార్లో బయలు దేరుతాడు. నిత్య ప్రాణాలతో కొట్టుకుంటుంది. తనపైకి ఎక్కి శ్వేత గొంతు పట్టుకుంటుంది. నా బాయ్ ఫ్రెండ్ ను నీకు ఇచ్చేయాలా అని చేతులతో నొక్కుతుంది.
ఇదే విషయాన్ని శ్వేత చెప్తుంది. దాంతో అర్జున్ శ్వేత చేయిని కోస్తాడు. తరువాత తనను చంపేస్తాడు. అంతే శ్వేతను చంపింది నువ్వా అని ఆధర్ష్ అంటాడు. శ్వేత ఆధర్ష్ కు ఫోన్ చేసి నేను ఒక అమ్మాయిని పొడిచేసిన అని చెప్తుంది. డ్రగ్స్ తీసుకుంటున్న ఆధర్ష్ శ్వేత ఇంటికి వెళ్తాడు. అతనికి అంతా చెబుతుంది. నువ్వు బయటకు వెళ్లు నేను చూసుకుంటా అని చెప్పి నిత్య దగ్గరకు వెళ్లి తన డ్రెస్ తీసేస్తాడు. శ్వేతను రేప్ చేస్తాడు. మళ్లీ డ్రగ్స్ తీసుకొని నిత్య గొంతు కోస్తాడు. శ్వేత దగ్గరకు వచ్చి తనను చంపేసినట్లు చెప్తాడు. ఈ బాడీని డిస్పోస్ చేయాలని తనను బయటకు లాక్కొస్తాడు. అదే సమయంలో కొరియర్ అభి అక్కడికి వస్తాడు. నిత్యను బయటకు లాక్కుంటు వస్తాడు. దాన్ని అభి చూస్తాడు. అతన్ని పట్టుకొని సెల్పీ తీసుకుంటాడు ఆధర్ష్. బయట చెప్తే నిన్ను కూడా ఇరికిస్తా అని బెధిరిస్తాడు. ఇదే విషయాన్ని అర్జున్ కు చెప్తాడు ఆధర్ష్. దాంతో అర్జున్ అతన్ని కాల్చి చంపేస్తాడు.
నెక్ట్స్ సీన్లో అజయ్ కి పూర్తి విషయం చెప్తాడు అర్జున్. శ్వేతను చంపింది నువ్వు కాదు, ఆధర్ష్ అని, ఈ కేసులో నువ్వు చేసింది న్యాయం అని చెప్తాడు. కట్ చేస్తే బీచ్ లో నిత్యతో అర్జున్ ముద్దుపెట్టుకున్న జ్ఙాపకాన్ని గుర్తుచేసుకొని బీచ్ లో ఒక్కడే బాధపడుతుంటాడు. ఆ సమయంలో అతని మరో కేసు వచ్చినట్లు ఫోన్ వస్తుంది.