హీరోయిన్ నయనతార చిక్కుల్లో పడ్డారు. నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఆమెకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6 లోపు డాక్యుమెంటరీలో వాడిన ‘నాన్ రౌడీ ధాన్’ మూవీ క్లిప్‌లపై సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. కాగా, ఆ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా ఆ మూవీ క్లిప్‌లు వాడారని నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.