»Bro The Star Heroine Of The Item Song In The Movie
BRO : ‘బ్రో’.. ఐటమ్ సాంగ్ కు అంత పెద్ద హీరోయినా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తో కలిసిన నటిస్తున్న చిత్రం బ్రో(BRO). ప్రముఖ నటుడు సముద్రఖని(samudra khani) దర్శకత్వం వహిస్తున్నాడు.
BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan).. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్(sai dharam tej) తో కలిసిన నటిస్తున్న చిత్రం బ్రో(BRO). ప్రముఖ నటుడు సముద్రఖని(samudra khani) దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’(Vinodya Seetham)కి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటినుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా వేగంగా జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి టాకీపార్టు పూర్తి అయింది. ఈ సినిమా మిగిలిన నటీనటుల పైన కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
బ్రో సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్(item song) కూడా ఉండబోతుందన్న వార్త వైరల్(viral) గా మారుతోంది. ఇందుకోసం హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రత్యేకమైన పబ్ సెట్(pub set) కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట షూటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా భాగం కాబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ తీసుకుంటారో అనే విషయంపై అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్(shruthi hasan) లేదా దిశా పటానీలను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. వీరిద్దరు ఎవరు డేట్ లో అడ్జస్ట్ అయితే వారిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్రో సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదల కాబోతోంది.