పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా జులై 28న గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డే వన్ నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెజారిటీ పీపుల్ మాత్రం మిక్స్డ్ రివ్యూలు ఇచ్చారు. అయిన భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
BRO: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ ఈ శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. కాస్త గ్యాప్ తర్వాత పెద్ద హీరో సినిమా థియేటర్లోకి రావడంతో.. అంతటా సందడి వాతావరణం నెలకొంది. ఫస్ట్ డే కొన్ని చోట్ల వర్షం పడుతున్నప్పటికీ పవర్ స్టార్ కోసం క్యూ కట్టారు జనాలు. దాంతో డే వన్ 48 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టింది బ్రో. ఇక సెకండ్ డే 27 కోట్లకి పైగా గ్రాస్‌ని రాబట్టి.. రెండు రోజుల్లో 75 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో పవన్ కెరీర్లోనే ఫాస్ట్‌గా 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ‘బ్రో’ నిలిచింది.
ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ప్రజెంట్ థియేటర్లో మరో సినిమా లేదు కాబట్టి.. ఈ వీకెండ్లో వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. కానీ 98 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బ్రో మూవీ.. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. అప్పుడే ఈ సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వారు భారీ రేటుకి సొంతం చేసుకున్నట్టు సమాచారం. అందుకే జులై 28న రిలీజ్ అయిన ఈ సినిమాను.. నెల రోజుల్లోనే ఆగష్టు 28న డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో.. కేతికా శర్మ హీరోయిన్గా నటించగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీ రోల్ ప్లే చేసింది.