అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent)తో మనముందుకు రాబోతున్నాడు. సరికొత్త కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సాంగ్, ప్రోమోస్, పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) ఏజెంట్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక పూర్తి స్పై థ్రిల్లర్ (Spy Thriller)గా తెరకెక్కుతోంది. మూవీలో అఖిల్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం తన బాడీని కూడా బిల్డ్ చేసి కండలు తిరిగిన దేహంతో అసలు సిసలైన ఏజెంట్ లా కనిపిస్తున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది.
‘ఏజెంట్’ సినిమా నుంచి రామకృష్ణా సాంగ్ ప్రోమో:
వేసవి కానుకగా ఏజెంట్ మూవీ(Agent Movie)ని రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 28వ తేదిన వరల్డ్ వైడ్ ఏజెంట్ మూవీ విడుదల కానుంది. మూవీ రిలీజ్ తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్ వర్క్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ఈ తరుణంలో తాజాగా ఏజెంట్ మూవీకి సంబంధించి మరో మేజర్ అప్ డేట్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
ఏజెంట్(Agent) మూవీ నుంచి మరో సాంగ్ (Song)ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీలో అఖిల్ బ్రేకప్ సాంగ్(Breakup Song) పాడనున్నాడు. ‘రామకృష్ణా’ అనే బ్రేకప్ సాంగ్ ప్రోమో(Song Promo)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఏజెంట్ మూవీకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ హిప్హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా ఏజెంట్ రిలీజ్ కానుంది.