Bombay Meri Jaan: బాంబే 1986 అనే టైటిల్ తో కథ సాగుతుంది. ఫోన్ రింగ్ అవుతుంది. మల్లిక్ నుంచి ఫోన్ వచ్చింది నేను వస్తున్నా అనగానే ధారా ఫోన్ పెట్టిస్తాడు. తరువాత సీన్లో ఫ్లైట్ రెడీగా ఉంది మనం వెంటనే దుబాయ్ వెళ్లిపోవాలి అంటాడు. దానికి అబ్బు ఒప్పకోవడం లేదు అని అబీబా అంటుంది. తరువాత సీన్లో ఇస్మయిల్ దుబాయ్ కి రాను అంటాడు. వీరు బలవంతం పెడితే గన్ తీసుకొని కాల్చుకోవాలని ప్రయత్నిస్తాడు ఇస్మయిల్. సైతాన్ ను కూడా అల్లానే సృష్టించాడు నేను కేవలం తండ్రిని అనే వాయిస్ ఓవర్లో టైటిల్స్ పడుతుంటాయి. తరువాత బాంబే 1964 అనే టైటిల్ ఎరియల్ షాట్ మీద ఒక ఫంక్షన్ ను చూపిస్తారు. ఆ ఫంక్షన్ లో ఇస్మాయిల్ బాయ్ వస్తాడు. అందరూ అతనికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడే పొట్టతో ఉన్న సకీనాకూడా ఇస్మయిల్ వైఫ్ కూడా ఉంటుంది.
తరువాత సీన్లో నలుగురు పిల్లలు సాధిక్, ధారా, నాసీర్, అజ్జు పైన టైలెట్ పోస్తుంటారు. అది ఫక్షన్ లో ఉన్న ఆడవాళ్ల మీద పడుతుంది. వాళ్లు ఉన్నట్లుండి వర్షం ఏంటని ఆలోచిస్తుండగా ఓ పాప పారి వచ్చి వారిని ఆటపట్టిస్తుంది. తన తల్లి వచ్చి పారిని తీసుకెళ్తుంది.
చదవండి:Mega 156:లో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్?
కట్ చేస్తే తరువాత సీన్లో సులేమాన్ మక్బుల్ అతడే హాజీ, పఠాన్ లు ఆ వేడుకకు వస్తారు. పెళ్లి వేదికను ఎక్కి వారికి శుభాకాంక్షలు చెబుతుంటే ఒక మహిళా వచ్చి వారిని తిడుతుంది. తన కొడుకు వీరి వల్లే మత్తుకు బానిస అయ్యాడని ఆవేదన చెందుతుంది. నెక్ట్స్ ఫ్లాష్ బ్యాక్ లో సులేమాన్ మక్బుల్ పని కోసం హైదరాబాద్ నుంచి బాంబైకి వస్తాడు. కూలిలతో కలిసి దొంగతనాలు మొదలు పెట్టాడు. సులేమాన్ ఆ వచ్చిన డబ్బులతో హజ్ కి వెళ్లి హాజీ సాబ్ అయి బాంబైకి బాద్షా గా మారుతాడు. గొప్పవారందరూ అతను ఇచ్చే పార్టీకి వచ్చేవారు. ఆ పార్టీలో సినిమా హీరోయిన్లు, వ్యాపార వేత్తాలు అందరు వచ్చేవారు, నిజానికి రావాల్సి వచ్చేది. అదే సమయంలో బిజినెస్ లు కూడా జరిపేవారు. మరో వైపు హజీ పఠాన్ అంటే బాంబైలో అందరికి భయం. వీరిద్దరూ కలిసి బాంబైలో డ్రగ్స్, నల్లమందు, భూములు కబ్జాలు, కిడ్నాపింగ్ లాంటివి చేసేవారు కాని వీటి వెనుక కేవలం పఠాన్ పేరు మాత్రమే వినిపించేది.
ఆ సమయంలో రత్నాగిరి నుంచి వచ్చిన ఎస్ఐ ఇస్మాయిల్ ఒక క్లబ్ మీద దాడి చేస్తాడు. అక్కడ తన సీనియర్ ఆఫీసర్ అయిన దత్తాను పట్టుకుంటాడు. కట్ చేస్తే తన సీనియర్ ఆఫీసర్ ఇస్మాయిల్ చేసింది రైట్ కాదు అని ఒక క్షమాపన లెటర్ రాయమని చెప్పి పంపిస్తాడు. తరువాత సీన్లో ఇస్మాయిల్ తన పోలీస్ ఫ్రెండ్స్ అయిన యూనిస్ ఖాన్, అహ్మాద్ అన్సారీ వాళ్ల ఫ్యామీలీలతో బీచ్ లో ఎవరికి భయపడకుండా ఏదోటి చేయాలని మాట్లాడుకుంటారు.
తరువాత సీన్లో ఢిల్లీలో బాంబై సిటీ కంప్లీట్ గా హాజీ, పఠాన్ చేతల్లోకి వెళ్తుంది అని అరవింద్ తో హోం మినిస్టర్ అంటాడు. మొత్తం వ్యవస్త నీకు సపోర్ట్ గా చేస్తుందని ఇకపై ఎం చేస్తావో నాకు తెలియదు హాజీ, పఠాన్ ల ఆట కట్టేయ్యాలని హోంమినిస్టర్ అరవింద్ కు చెప్తాడు. తరువాత సీన్లో బాంబై వీధుల్లో ఇస్మాయిల్ స్నాక్స్ కొట్టాడు. అక్కడ ఫ్రెండ్స్ తో క్షమాపణ లేటర్ ఎలా రాయాలో తెలియదు అని మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో ఆరీప్ ను దారీస్ పటేల్ తన పర్స్ తీసుకున్నందుకు కొడుతూ ఉంటాడు. అక్కడికి ఇస్మాయిల్ కొడుకులు సాధిక్, ధారా వచ్చి ఆరీఫ్ విడిపించుకొని వెళ్తారు. తరువాత సీన్లో ధారా ఆ పర్సులోంచి డబ్బులు కొట్టేసినట్లు చెప్తాడు. తనతో ఉన్న పిల్లలు ఆనంద పడుతారు. మరో సీన్లో ఆ పర్సులో డబ్బులు లేవన్న విషయం దారీస్ పటేల్ కు తెలుస్తుంది.
నెక్ట్స్ సీన్లలో ఇస్మాయిల్ ఇంటికి రహిమ్, పిల్లలతో వస్తాడు. తానోక్ వాచ్ షాప్ చెట్టుకుంటానని దానికి డబ్బులు కావాలని అడుగుతాడు. దానికి బిజినెస్ వద్దని ఒక షాప్ లో ఉద్యోగం చేయమని ఇస్మాయిల్ అంటాడు. తనకు ఇష్టం లేకున్నా ఒకే అనుకుంటూ వెళ్తాడు. రహిమ్ వెళ్లిన తరువాత సకీనా అన్నం తినమని పిల్లల మీద కోప్పడుతుంది. అర్థం చేసుకున్న ఇస్మాయిల్ ఏదోటి చేసి డబ్బులు ఇస్తా అని చెప్తాడు.
కట్ చేస్తే ముగ్గురు పోలీసుల కలసి ఐఏఎస్ అరవింద్ కు క్షమాపణ లెటర్ ఇచ్చి, మాట్లాడుదామని వెళ్తారు. అక్కడ పోలీసులను అరెస్ట్ చేసింది నేనే అని వీళ్లిద్దరికి ఏ తప్పు తెలియదు అని ఇస్మైల్ అంటాడు. దానికి తనతో ఉన్న పోలీసులు ఒప్పుకోరు ఏ పనిష్మెంట్ అయినా ముగ్గురు కలిసే ఇవ్వండి యూనిస్, అన్సారీలు అంటారు. అది చూసిన అరవింద్ ఇదిగో మీ పనిష్మెంట్ అని ప్రమోషన్ లెటర్స్ ఇచ్చి మీరు చేసిన పనికి గర్వపడుతున్నట్లు చెప్తాడు. డైరెక్ట్ గా మీరు నాకే రిపోర్ట్ చేయండి అని వేరే ఆఫీస్ నుంచి పనిచేయాలని, మీ స్క్వాడ్ పేరు పటాన్ స్క్వాడ్ అని చెప్పి పంపిస్తాడు. నెక్ట్స్ సీన్లో సలీమ్ మిర్చి అనే పఠాన్ వ్యక్తిని పట్టుకొని స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో, ఏ షిప్ లో సరకు వస్తుందో తెలుసుకోవాలని అతన్ని కొడుతాడు ఇస్మయిల్. తరువాత సీన్లో హాజీ, పఠాన్ కు ఈ దందాతో పాటు కుస్తీ పోటీలు ఇష్టమని అందులో అబ్దుల్ అనే వ్యక్తి బలశాలిగా కనిపించే సరికి అతన్ని జలాల్ తో ఫైట్ చేయమని చెప్తాడు. అక్కడికి హాజీ బాయ్ వస్తాడు. ఆ సమయంలో జలాల్ చీటింగ్ చేసి అబ్దుల్ ను కిందపడేస్తాడు. అందరూ జలాల్ ను పొగుడుతుంటే హాజీ బాయ్ మాత్రం అబ్దుల్ ను పొగుడుతాడు. పోలీసులు కొత్త స్క్వాడ్ ను ఏర్పాటు చేసినట్లు జాగ్రత్తగా ఉండమని పఠాన్ కు చెప్తాడు హాజీ. తరువాత సీన్లో పఠాన్ చేస్తున్న స్మగ్లింగ్ బోర్టింగ్ లో రైడ్ చేస్తారు. ఎంత వెతికిన ఏం దొరకదు. కస్టమ్స్ కు ఇస్మాయిల్ కు గొడవ జరుగుతుంది. దాంతో అరవింద్ ఫోన్ చేసి ఇస్మాయిల్ ను తిడుతాడు. ఇంకోసారి ఈ తప్పు జరిగితే పఠాన్ స్క్వాడ్ తీసేస్తా అని హెచ్చరిస్తాడు. దాంతో ఇస్మాయిల్ కోపంతో సలీమ్ మిర్చిని తీసుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చి అతన్ని ఎన్ కౌంటర్ చేస్తాను అని బెదిరిస్తాడు. దాంతో భయపడ్డ మిర్చి శ్రీ వస్తావ్ అనే కస్టమ్ ఆఫీసర్ కు అన్ని తెలుసని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో శ్రీ వస్తావ్ ను కొట్టి సరకు ఎప్పుడు వస్తుంది అని అడిగే సరికి రేపు వస్తుంది అని చెప్తాడు.
తరువాత సీన్లో ధారా ఇంగ్లీష్ మాట్లాడడం చూసి ఇస్మయిల్ సంతోషించగానే సాధిక్ కూడా ఇంగ్లీష్ స్కూల్లో చదువుతా అని అంటాడు. దాంతో ఇస్మాయిలో ఏదో ఒకటి చెప్పి పడుకో అంటాడు. కాని తాను తన రెండో కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించనందుకు బాధపడుతుంటాడు. నెక్ట్స్ సీన్లో మళ్లీ హర్బర్ లో పోలీసులు సరకును చెక్ చేస్తారు. అయినా సరే అక్కడ ఏమి దొరకదు. తరువాత చేపలు పట్టే బోటులో ఏదో జరగుతుందని కనిపెట్టి అక్కడికి బోటులో వెళ్తారు. వారిని పట్టుకుంటే స్మగుల్ అవుతున్న బంగారం మొత్తం సీజ్ చేస్తారు. తరువాత సీన్లో హాజీ తో పఠాన్ మాట్లాడుతుంటాడు. ఆ పోలీసోడి ఫ్యామిలీని ఏదోటి చేయాలని చెప్తాడు. మరో సీన్లో అరవింద్ ఇస్మాయిల్ ను పొగుడుతాడు. కట్ చేస్తే ధారా ఇంటికి వస్తాడు. తినడానికి ఏదైనా పెట్టమని అడుగుతుండగా సకీనాకి పెయిన్స్ వస్తాయి. దాంతో ఇస్మయిల్ కు ఫోన్ చేయడానికి ధారీస్ పటేల్ షాప్ కు వెళ్లి ఫోన్ చేయడాని ట్రై చేయగా అతను ఆ రోజు తన పర్సులోంచి దొబ్బేసిన డబ్బుల విషయంలో కొప్పడుతుంటాడు.
కట్ చేస్తే ఇస్మాయిల్ ఆసుపత్రికి వెళ్తాడు అక్కడ సకీనా ఆడబిడ్డకు జన్మినిస్తుంది. ధారా మాత్రం నాకు చెల్లెలు కాదు తమ్ముడు కావాలి అంటాడు. తరువాత ధారా తన చెల్లెలను ఎత్తుకొని హబీబా అని పేరు పెడుతాడు. తరువాత సీన్లో ఇస్మాయిల్ ఇంట్లో తన కూతురిని ఎత్తుకొని లాలిస్తూ ఉండగా డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. దాంతో తన పిల్లలేమో అనుకొని సకీనా డోర్ తీయగా వచ్చింది హాజీ. ఇస్మాయిల్ ఇంటికి హాజీ వచ్చి నిల్చొని తన కూతురికి హబీబా అనే మంచి పేరు పెట్టినట్లు చెప్తాడు. దాంతో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది.
రెండవ ఎపిసోడ్ బాంబై 1945 అని పడుతుంది. గాలిబ్, మక్బుల్ ఇద్దరు కలిసి గోల్డ్ ను చోరీ చేస్తారు. దాన్ని ఒక చోట దాచిపెడుతారు. తరువాత సీన్లో గాలిబ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. సులేమాన్ వెళ్లి తన బంగారం జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకుంటాడు. తరువాత సీన్లో గాలిబ్ ను పోలీసు స్టేషన్ లో కలుసుకుంటాడు. అదే విషయాన్ని అతని భార్యకు కలిసి చెప్పి వారికి కొంత డబ్బు ఇస్తాడు. రోజు అలా బంగారాన్ని అమ్మి వారికి డబ్బులు ఇస్తాడు. ఒక రోజు గాలిబ్ వస్తాడు. తరువాత ఇద్దరు కలిసి తమ బంగారం ఉన్న చోటుకు వెళ్తారు. అక్కడికి పోలీసులు వస్తారు. సాయం చేయకపోతే తనను చంపెస్తా అని బెదిరించే సరికి నిజం చెప్పినట్లు చెప్తాడు గాలిబ్. తరువాత సీన్లో గాలిబ్ అన్నం తింటుండగా ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. ఎవరా అని చూసేసరికి అతన్ని చంపేసి వెళ్లిపోతాడు మక్బుల్. ఇదే విషయాన్ని హాజీ ఇస్మాయిల్ కు చెప్తాడు. తనతో డీల్ మాట్లాడుకోవడానికి వస్తాడు. కాని ఇస్మాయిల్ ఒప్పుకోడు. తాను ఇచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించి పంపించేస్తాడు. ఇంటిముందు బెంజ్ కారు ఆగడంతో ఇస్మాయిల్ పిల్లలు సంతోషపడుతుంటారు. ధారా కారును ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కడికి హాజీ వచ్చి ధారాతో మాట్లాడుతాడు. కార్లో కూర్చుంటావా అంటే నా సొంత బండిలోనే కూర్చుంటాను అని అంటాడు ధారా. అది విని హాజీ నవ్వి నువ్వు కూర్చుంటావు అని తన కార్లో వెళ్లిపోతాడు. కింద జరుగుతున్న సంఘటనను పైనుంచి ఇస్మాయిల్ చూస్తూ ఉంటాడు.
తరువాత ఖురాన్ చదివి తన పిల్లలకు వివరిస్తుంటాడు. తప్పు చేయకూడదు అంటూ చెప్తుండగా ధారా మాత్రం అన్ని నేరాలు చేసిన హాజీకి మెర్సిడిస్ బెంజ్ కారు ఉందని వాదిస్తుంటాడు. అదే సమయంలో రహిమ్ వచ్చి సకీనా తో మాట్లాడుతుంటాడు. అక్కడి వచ్చిన ఇస్మాయిల్ డబ్బులు ఏమి లేవు ఇక్కడనుంచి వెళ్లిపోమ్మాంటాడు. దానికి ఇక్కడి హాజీ వచ్చాడని, లంచం కూడా ఇచ్చాడని చెప్పడంతో ఇస్మాయిల్ కు కోపం వచ్చి రహిమ్ ను కొట్టి పంపించేస్తాడు. రహిమ్ విషయంలో నేను ఏం చేయలేనని సకీనాతో ఇస్మాయిల్ చెప్తాడు.
కట్ చేస్తే ముంబాయ్ లో అతి పెద్ద స్లమ్ అయిన దారావి రాజు అన్నారాజన్ ముదిలేయర్ అక్కడ చాలా మంది పిల్లను తన స్మగ్లింగ్ లో దింపి వారిని చూసుకుంటుంటాడు. అక్కడికి హాజీ వచ్చి అన్నారాజన్ తోడు కావాలని అంటాడు. ఇస్మాయిల్ విషయంలో మనం కలిసి పనిచేస్తే మనకు తిరుగులేదని హాజీ అంటాడు. వారితో పఠాన్ ను కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ముంబాయి పోలీసులకు మరింత తలనొప్పిగా మారుతారు. అన్నారాజన్ కు ట్యాక్సీల బిజినెస్ ఉంటుంది. దాంతో తన ట్యాక్సీలో స్మగ్లింగ్ చేస్తున్నారు అనే అనుమానంతో అన్ని ట్యాక్సీలు చెక్ చేసినా ఏం దొరకవు. ఇస్మాయిల్ ఇన్ఫార్మర్ కు ఫోన్ చేసి నువ్వు చెప్పింది అంతా తప్పు అని తిడుతాడు.
తరువాత సీన్లో ఇస్మాయిల్ ఇంటికి ఇంగ్లీఫ్ పేపర్ వస్తుంది. దాన్ని చదవమని ధారాకు ఇస్తాడు ఇస్మాయిల్. ధారా భయపడుతూ చదువుతాడు. తరువాత సీన్లో ధారా అసలు స్కూల్ కే వెళ్లడు అని డుమ్మా కొట్టి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటాడు. అదే విషయాన్ని తన సోదరులకు చెప్పి నాన్నకు చెప్పద్దోని అంటాడు. తరువాత క్రికెట్ ఆడి గెలిచిన డబ్బులతో ఐస్ క్రీమ్ తింటుంటాడు. తరువాత తన ఫ్రెండ్ నాసీర్ కావాలనే ఓడిపోయాడని చెప్తాడు. అక్కడికి పారి వచ్చి తన ఐస్ క్రీమ్ కావాలని తీసుకెళ్తుంది. నెక్ట్స్ సీన్లో ఇస్మాయిల్ తన షర్ట్ మార్చుకుంటూ ధారా షర్ట్ ఎందుకు ఇంత మురికిగా ఉందని అడుగుతాడు. అంతలో సకీనా కబాబ్ తీసుకోస్తుంది. అది కూడా ధారానే తీసుకొచ్చాడు అని చెప్పే సరికి ఇస్మాయిల్ కు డౌట్ వస్తుంది. కట్ చేస్తే గ్రౌండ్లో మళ్లీ క్రికెట్ ఆడుతుంటారు. అక్కడికి ఇస్మాయిల్ వస్తాడు. కట్ చేస్తే ధారాను చెంపమీద కొట్టి స్కూల్ కు వెళ్లికుండా, క్రికెట్ ఆడుతున్నట్లు, ఇంట్లో అబద్దాలు కూడా చెప్తున్నట్లు చెప్పి డ్యూటీకి వెళ్తాడు. తరువాత సీన్లో తన ఫ్రెండ్ తో ధారా చేయిదాటేలా కనిపిస్తున్నాడని చెప్తాడు. మున్నా అనే ఇన్ఫార్మ్ తో మాట్లాడుతారు ఇస్మయిల్. సరకు ట్యాక్సీలోనే ఉన్నట్లు చెప్తాడు. కట్ చేస్తే ఆ ట్యాక్సీని ఆపి గోల్డ్ పట్టుకుంటారు. తరువాత సీన్లో రఘు అనే ట్యాక్స్ డ్రైవర్ ను పట్టుకొని పోలీసులు దర్యాప్తు చేస్తారు. తానను ఇన్ఫార్మర్ గా మార్చుకుందామని ప్లాన్ చేస్తారు. అలా వాళ్లు చేసే దందాను పట్టుకోవాలని ఆలోచిస్తారు. తరువాత సీన్లో రహిమ్ హాజీని కలువడానికి నేరుగా ఇంటికి వెల్లి ఇస్మాయిల్ బామ్మర్ధిని అని నీతో పనిచేయాలని చెప్తాడు. జీవితాంతం నీ కోసం పనిచేస్తా అని నాకు ఉంటానికి చోటు కావాలని చెప్తాడు.
తరువాత సీన్లో ఇస్మాయిల్ ఫ్యామిలీ నమాజు చేసుకుంటారు. ధారాను దర్గాకు తీసుకెళ్తుంది సకీనా. పీర్ బాబాను కలిసి మాట్లాడుతారు. నెక్ట్స్ సీన్లో పోలీసుస్టేషన్ పోలీసులు మాట్లాడుకుంటారు. ఇంట్లొ హకీకా ఉందని తన ఫ్రెండ్స్ ఇస్మాయిల్ ను ఇంటికి పంపిస్తారు. ఇంటి దగ్గర సకీనా హాడావిడి చేస్తుంది. మరో సీన్లో రహిమ్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. స్టేషన్ లో ఫోన్ మోగుతుంది. రఘు ఫోన్ చేసి సరకు వెళ్తున్న కారు నెంబర్ చెప్తాడు. మరోవైపు ఇస్మాయిల్ ఇంట్లో హకీకా వేడుకలు ప్రారంభిస్తారు. మరో సీన్లో అక్కడికి వచ్చిన వెహికల్స్ ను దత్తా అనే పోలీసు ఆఫీసర్ ఉన్నాడని అతన్ని పంపించి అహ్మాద్ అన్సారీ, యూనిస్ ఖాన్, ఆ కారును చెక్ చేస్తాడు. అంతలో రహిమ్, ఇంకో వ్యక్తి ఇద్దరు పారిపోతారు. వారిని పోలీసులు తరుముతారు. పోలీసులకు ఆ వ్యక్తి దొరికిపోతాడు. రహిమ్ తప్పించుకుంటాడు. ఇంట్లో ధారా తన తమ్ముళ్లతో కలిసి మన క్రికెట్ ఆడలేమా అని మాట్లాడుకుంటారు. అక్కడికి రహిమ్ రావడం ఇస్మాయిల్ చూస్తాడు. సకీనా తనతో మాట్లాడుతుంటే ఇస్మాయిల్ అక్కడికి వస్తాడు. తనను కాపాడమని ఇస్మాయిల్ కాళ్లు పట్టుకొని ఏడుస్తుంటాడు. తన వేసుకున్న షర్ట్ రక్తంతో నిండి ఉంటుంది. ఇంట్లోను టైలెట్ పోసుకుంటాడు. తప్పయిందని ఏడుస్తాడు. వాన్ని కాపాడమని సకీనా ఇస్మాయిల్ ను అడుగుతుంది. కట్ చేస్తే రహిమ్ ను తీసుకొని స్టేషన్ ను వెళ్లి అతన్ని ట్రైన్ ఎక్కించి వస్తుంటాడు ఇస్మయిల్. అక్కడ ఇద్దరు పోలీసులు వింతగా చూస్తారు. ఇంటికి వచ్చేసరికి హాకికి జరగలేదని సకీనా చెప్తుండగా అక్కడికి యూనిస్ ఖాన్ వచ్చి రహిమ్ గురించి అడుగుతాడు. వారు మాట్లాడుతుండగా ఆఫీసర్ జేజే ఆసుపత్రికి రమ్మంటున్నారని చెప్తాడు. దాంతో అందరు కలిసి ఆసుపత్రికి వెళ్లగానే ఆహ్మాద్ అన్సారీ చనిపోయి ఉంటాడు. అక్కడికి ఒక పోలీసు అధికారి వచ్చి రహిమ్ ను ట్రైన్ లో ఎక్కిస్తుండగా ఇద్దరు కానిస్టేబుల్స్ చూసారని చెప్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో రహిమ్ కోసం వెతుకుతూ వెళ్లిన అహ్మాద్ కు రహిమ్ పొడుస్తుడు. అన్సారీ బాడీని చూసి ఇస్మయిల్ బాధపడుతాడు.
ఆసుపత్రిలో సీన్ ఓపెన్ అవుతుంది. ఆసుపత్రి నుంచి ఇస్మాయిల్ ఆయాసపడుతూ వస్తాడు. అక్కడికి అహ్మాద్ భార్య మెహర్ వస్తుంది. ఇస్మయిల్ ను కొట్టి ఏడుస్తుంది. అక్కడికి యూనిస్ వచ్చి మేహర్ ని తీసుకొని వెళ్తాడు. డోర్ కొట్టి ఇస్మాయిల్ ఇంట్లోకి వస్తాడు. సకీనా రహిమ్ గురించి అడుగుతుంది. అతను బాగానే ఉన్నాడు. కాని అహ్మాద్ ఆసుపత్రిలో పడుకొని ఉన్నాడని చెప్తుంటాడు. అది ధారా వింటాడు. కట్ చేస్తే ఇస్మయిల్ చాలా నిజాయితీ పరుడని అరవింద్ హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతుంటాడు. రహిమ్ నిజం చెప్తే ఇస్మాయిల్ సేఫ్ అవుతాడని అంటాడు. కట్ చేస్తే ఇస్మయిల్ తో అరవింద్ మాట్లాడుతాడు. ఇస్మయిల్ ను సస్పెండ్ చేసి, పాఠాన్ స్వ్కాడ్ ను క్లోజ్ చేస్తున్నట్లు అరవింద్ చెప్తాడు. తరువాత సీన్లో హాజీ, పఠాన్ ఒక పోలీసు అధికారితో మాట్లాడుతుంటాడు. అసలు ఇస్మాయిల్ కేసులో ఏం జరుగుతుంది. రహిమ్ ఎక్కడా అని అడుగుతాడు. వాళ్లకు రహిమ్ కావాలని అని హాజీ చెప్తాడు. తరువాత సీన్లో ఇస్మాయిల్ మజీద్ లో నమాజ్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడి యూనిస్ వస్తాడు. నేను హాజీకోసం పనిచేశానా అని ఇస్మయిల్ అడుగుతాడు. లేదు కాని నేను ఇకపై హాజీకోసం పని చేస్తా అని యూనిస్ చెప్తాడు.
తరువాత సీన్లో నాసీర్, ధారా ఇద్దరు మాట్లాడుకుంటారు. సాధిక్ వదిలేయమంటే నన్ను వదిలేస్తావా ధారా అని అడుగుతాడు. దానికి వాడు అన్న కాని నువ్వు నా అన్న కన్న ఎక్కువ అని అంటాడు ధారా. అంతలో దారీస్ పటేల్ కొట్టు కనిపిస్తుంది. వీడు ఒక్క ఫోన్ కూడా చేయనివ్వలేదని వాడి అంతు చూడాలని అంటాడు ధారా. తన ఫ్రెండ్ నాసీర్ తో కలిసి పటేల్ కొట్లో సమాన్లను పగలగొడుతాడు. అతను వెంట పడుతుండగా వీధులన్ని పరిగెత్తిస్తాడు. అలా పరిగెత్తించి ఒక చోట ఆగితే అక్కడికి పారి వస్తుంది. తన చేతులో క్రీమ్ రోల్ నీ కోసమే తెచ్చానని చెప్తాడు. తాను దారీస్ పటేల్ కూతురు. తన కొట్లొనే దొంగలిచ్చి తీసుకొచ్చానని చెప్తాడు.
మరో సీన్లో ఇస్మాయిల్ పని కోసం వెళ్తాడు. కట్ చేస్తే ఇస్మాయల్ ను మజీద్ లో హాజీ కలుస్తాడు. తనతో కలిసి పనిచేయమని తన భార్యబిడ్డల గురించి ఆలోచించమని అడుగుతాడు. దానికి ఇస్మయిల్ ఒప్పుకోడు. తరువాత సీన్లో హాజీ, అన్నా రాజన్, పఠాన్ ముగ్గురు కలిసి తింటుంటారు. ఇస్మయిల్ ను చంపేయాలని పఠాన్ సలహా చేప్తాడు. కాని హాజీ తనను చంపడం కన్నా మనతో కలుపుకోవడం మేలు అంటాడు. నెక్ట్స్ సీన్లో ఇస్మయిల్ ను పనిలోంచి తీసేస్తారు. ముంబాయి అంతా అడిగినా ఎక్కడా పని దొరకదు. అదే సమయంలో సకీనా ఇంట్లో సరకులు అయిపోయిన డబ్బాలను చూస్తుంది. అక్కడికి ఇస్మయిల్ వస్తాడు. నేను ఓడిపోను అని భార్యతో చెప్తాడు. అదే సమయంలో ధారా స్కూల్ కు వెళ్లలేదా అని అడుగుతాడు. కట్ చేస్తే ఫీజు కట్టడానికి కొంచెం సమయం కావాలని అడిగితే దానికి ప్రిన్స్ పల్ ఒప్పుకోడు. ఇంట్లో అన్నం తింటుండగా కరెంట్ పోతుంది. ఇంటిలో ఫ్యాన్ తిరగదు. పిల్లు నిద్రరావడం లేదని, వేడిగా ఉందని గోళ చేస్తుంటారు. సకీనా తన ఒంటిమీదున్న బంగారన్ని అమ్మి ఇల్లు నడిపిస్తారు.
ఈద్ కోసం మేకను కొద్దామని సకీనా అంటుంది. మనకు అంత స్థోమత లేదని ఇస్మయిల్ అంటాడు. ఇంట్లో పిల్లలు మేకను ఎప్పుడు కొందామని అడుగుతారు. వారికి ఏదో సమాధానం చెప్పి వెళ్లి పడుకోమంటుంది సకీనా. కట్ చేస్తే మేకలో సంతా జరగుతుండగా అక్కడికి వెళ్లీ మేకను దొంగతనం చేసి తీసుకొస్తారు పిల్లలు. అది ఇంట్లో తీసుకొచ్చి కట్టేస్తారు. బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఇస్మియిల్, మేక ఓనర్ తో బట్చర్ లు ఉంటారు. ఎందుకు దొంగతనం చేశావు అని బెల్ట్ తీసుకొని కొడుతాడు ఇస్మియిల్. చాలా ఎమోషనల్ కొట్టి ఎందుకు చేశావు అని అడుగుతాడు. ఎంత కొట్టిన చలించిన ధారా నువ్వు మేకును కొనలేదు కదా అందుకే నేను తీసుకొచ్చా అంటాడు. ఆ మాటతో ఇంకా కోపం వచ్చి గట్టిగా కొడుతాడు. సకీనా అడ్డుపడి ఆపుతుంది. ధారా అలానే చూస్తూ ఉంటాడు.
తన చెంపకు బ్యాండెడ్ వేసుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే బట్చర్ ఇంట్లో నమాజుకు టైమ్ అయిందని తన వైఫ్ నిద్ర లేపుతుంది. అలా నిద్ర బయటకు వేళ్లి గట్టిగా అరుస్తుంది. బట్చర్ వచ్చి చూసే సరికి అక్కడ మేక తలకాయ ఉంటుంది. తరువాత సీన్లో అందరూ కలిసి నమాజ్ చేస్తుంటారు. అందరూ ఈద్ ముబారక్ అని చెప్పుకుంటారు. తన కొడుకులకు ఈద్ ముబారక్ అని చెప్తుండగా ధారాకు చెప్పేలోపే అక్కడికి హాజీ వస్తాడు. ఈద్ ముబారక్ చెప్పి ధారా జేబులో డబ్బులు పెట్తాడు. అవి తిరిగి ఇచ్చేయని ఇస్మయిల్ చెప్పినా ధారా సైలెంట్ గా ఉంటాడు. పిల్లలు ఇంటికి రాగానే ఇంట్లో బిర్యాని ఉంటుంది. అది చూసి పిల్లలు ఇష్టంగా తినడానికి కూర్చుంటారు. అక్కడిక హాజీ మనిషి అబ్దుల్లా ఉంటాడు. బయట హాజీ రమ్మాన్నాడని బయటకు వెళ్లిపోతాడు. అంతలో ధారా తన దగ్గర ఉన్న డబ్బులను నసీనాకు ఇది నా ఈదీ అని ఇస్తాడు. కట్ చేస్తే హాజీ, పఠాన్, అన్నారాజన్ అందరు కలుస్తారు. అక్కడికి రహిమ్ ను తీసుకొస్తారు. ఇస్మయిల్ ను బెదిరిస్తారు. రహిమ్ ను చంపేస్తారు. ఇస్మయిల్ తమతో చేతులు కలుపుతాడు. కట్ చేస్తే వారితో కలిసి స్మగ్లింగ్ చేస్తాడు.
ఇందిరా గాంధీ 1971లో పాకిస్తాన్ పై యుద్దం ప్రకటిస్తుంది. ఆ సమయంలో అందరూ ఫకీర్లను చేసిందని ఆ సమయంలో కూడా హాజీ, పఠాన్ల దందా చాలా బాగా జరుగుతుంది. 1975లో ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో పోలీస్ ఫోర్సులో మార్పు వస్తుంది. ముంబాయికి మల్లిక్ అని మరో పోలీసు ఆఫీసర్ వస్తాడు. దాంతో ముంబాయ్ పరిస్థితులు హాజీ చేయి దాటిపోతుంది. మాల్లిక్ హాజీ ఇంటికి వచ్చి అందరిని అరెస్ట్ చేస్తాడు. ఎమర్జెన్సీని ఉపయోగించుకొని ముగ్గురిని ఖైదు చేస్తాడు. బాంబై 1977 లో పఠాన్ ఇంట్లో కుస్తీల పోటీలను బిలావల్ చూస్తుంటాడు. అదే సమయంలో ధారా, సాధీక్, నాసీర్, అజ్జు పెద్దవాళ్లు అవుతారు. అలా నలుగురు నవ్వుకుంటూ వెళ్తూ ఒక షాప్ దగ్గర ఆగుతారు. అక్కడ రాడో అనే వాచ్ కనిపిస్తుంది. నాసీర్ ఆ వాచ్ ను చూసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అబ్బు ఈ వాచ్ ఇప్పిస్తా అన్నాడని చెప్తాడు. దానికి ధారా ఆ వాచ్ ఎలాగైనా కావాలి అనుకొని ప్లాన్ చేస్తా అంటాడు.
అలా వారు ఒక చోట కూర్చొని ఆలోచిస్తుండగా ఒక అతను డబ్బు బ్యాగ్ తో వెళ్తుండగా అతని దగ్గర కొట్టేస్తారు. వెళ్లి ఆ వాచ్ ను కొంటారు. తరువాత సీన్లో మరోకతను రాడో వాచ్ కోసం బేరం ఆడుతుంటే వాడిని బురిడి కొట్టించి తక్కువ ధరకే రాడో వాచ్ అని అందులో రాయి పెట్టి ఇస్తారు. అలా వాచ్ కోసం వచ్చిన అందరికి అదే మాదిరిగా మోసం చేస్తూ ఉంటారు. అలా చాలా మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అందరూ కలిసి బిల్డింగ్ పైన లెక్కపెడతుంటారు. అక్కడికి హబీబా వస్తుంది. వాళ్లతో కలిసి వాట అడిగి తీసుకెళ్తుంది. కట్ చేస్తే ఇస్మాయిల్ బాయ్ మజీదులో నమోజా చేస్తుంటాడు. ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలని మౌల్వీ సాబ్ అంటాడు. దానికి రాత్రికి ఇంటికి భోజనానికి వచ్చేయండి అని ఇస్మయిల్ అంటాడు. తరువాత సీన్లో సకీనా మౌల్వీ ఎందుకు వస్తున్నాడో అని ఆలోచిస్తుంది. తరువాత సీన్లో మౌల్వీ ఇంటికి వస్తాడు. అయితే ధరా ఏమన్నా తప్పుడు పన్లు చేశాడేమో అని అడుగుతారు. అయితే మౌల్వీ హాబీబాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చానని చెప్తాడు. అది హబీబాకు ఇష్టం ఉండదు. తినేసి ఇస్మయిల్ తో మౌళ్వీ మాట్లాడుకుంటూ వెళ్తుంటే తన కొడుకులు వస్తారు. వారితో మసీద్ కు మరమత్తులు చేయించాలి అని చెప్పి వెళ్తాడు. కట్ చేస్తే ధారా, సాధిక్ తన తమ్ముడు చందాలను వసుల్లు చేస్తారు. బెదిరించి మరి డబ్బులు అడుగుతారు. అందరికి వారికి బయపడి చందాలు ఇస్తారు.
తరువాత చందా కోసం దారీస్ పటేల్ కొట్టుకు వెళ్తే అక్కడ పారి ఉంటుంది. చందా కోసం కాదు కొనడానికి వచ్చామని ధరా చెప్తాడు. తాను అడిగింది ఇచ్చాకా అక్కడికి దారీస్ పటేల్ వస్తాడు. పారి, ధారా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. తరువాత సీన్లో ఇస్మయిల్, సకీనా మార్కెట్లో ఏదో సమాన్లు కొంటుండగా అక్కడికి మౌళ్వీ వచ్చి హబీబా కోసం సంబంధం గురించి మాట్లాడుతుంటాడు. అక్కడికి ధారా, సాధిక్ లు వస్తారు. కలెక్ట్ చేసిన చందాను అతనికి ఇస్తారు. అది తీసుకొని వారిని ఆశీర్వదించి వెళ్లిపోతాడు. తరువాత సకీనా అంత డబ్బు ఒక్కరోజులోనే ఎలా సంపాదించారు అని మురిసిపోతుంది. అదే టైమ్ లో వారికి ఒక ఆలోచన వస్తుంది. జనం దగ్గర నుంచి హాప్తా వసుళ్ చేద్దాం అని ఆలోచిస్తారు. మార్కెట్లో హామిద్ అనే వ్యక్తి హప్తా వసూళ్ చేస్తున్నట్లు మాట్లాడుకుంటారు. తరువాత వారంతా ఇంటికి వస్తారు. భోజనం కోసం కూర్చొని హబీబా పిలిస్తే తను రాదు అని సకీనా చెప్తుంది. దాంతో ధారా హబీబీ దగ్గరకు వెళ్లి కూల్ చేస్తాడు.
తరువాత సీన్లో హబీబా బస్సులో వెళ్తుంది. ఒకడు బస్సులో తాకితే వాడికి దమ్కీ ఇస్తుంది. నెక్ట్స్ సీన్లో హామీద్ గ్యాంగ్ వచ్చి హప్తా కోసం అడుగుతారు. దానికి షాపతను ధారా గ్యాంగ్ వచ్చి ముందురోజే తీసుకెళ్లినట్లు చెప్తాడు. తరువాత సీన్లో పారి, హాబీబా ఇద్దరూ కలిసి అతిఫ్ ను కలవడానికి వెళ్తారు. అక్కడి అతిఫ్ కు వార్నింగ్ ఇస్తారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పమని బెదిరిస్తాడు. తరువాతి సీన్లో ధరా తన గ్యాంగ్ తో షాపతని దగ్గరకు వెళ్తాడు. నిన్న హమీద్ వచ్చాడని చెప్తాడు. దానికి మేమ్ చూసుకుంటాము అని మాట్లాడుతుండగా అక్కడికి హామీద్ గ్యాంగ్ వస్తుంది. రెండు గ్యాంగులు ఫైట్ చేసుకుంటాయి. హామీద్ గ్యాంగ్ ను కొట్టి తరిమేస్తారు. ఇవ్వాలటి నుంచి హప్తా మేమ్ వసూల చేస్తామని గట్టిగా అరుస్తాడు. నెక్ట్స్ సీన్లో బిలావల్ మసాజ్ చేసుకుంటుంటాడు. అక్కడికి ఇస్మయిల్ వచ్చి చంబూర్ గోదామ్ మల్లిక్ రైడ్ చేసి బంగారం సీజ్ చేసి మనుషులను తీసుకెళ్లాడు అని చెప్తాడు. అందరిని తీసుకొచ్చెయ్ అని బిలవాల్ అంటే అది సాధ్యం కాదు, యునిస్ కు కూడా సాధ్యం కాదు అంటాడు. అయితే మళ్లిక్ నే ఏదోటి చేయి అంటాడు బిల్వాల్. అలాగే ఇస్మయిల్ ను తిడుతాడు. అక్కడికి హామీద్ వస్తాడు. ధారా కొట్టాడని హప్తా అడుగుతున్నట్లు చెప్తాడు. దానికి ఇస్మయిల్ ను తిడుతాడు బిలావల్.
ధారాకు ఏది తెలియదు అని ఇస్మయిల్ అంటాడు. అబ్దుల్లా అడ్డు వస్తే అతన్ని కూడా తిడుతాడు. నెక్ట్స్ సీన్లో సకీనాతో అతిఫ్ అమ్మి వచ్చి పెళ్లి చేసుకోవడం తన కొడుక్కు ఇష్టం లేదని చెప్పి వెళ్తుంది. అదే సమయంలో ఇస్మయిల్ వస్తాడు. అతిఫ్ పెళ్లి వద్దన్న విషయం సకీనా చెప్తుంది. తన కొడుకు హప్తా వసూళ్ చేస్తున్నాడని ఇస్మయిల్ ఇంట్లో తిడుతాడు. తరువాత సీన్లో బిలవాల్ మేనల్లుడిని కొట్టావా… నీ అంత్యక్రియలు చేయమన్నాడని అనే విషయాన్నిహబీబా చెప్తుంది. అది విని ధారా కోపంతో వెళ్తాడు. మరో సీన్లో ధారాను కొట్టాడానికి బిలవాల్ మనుషులు ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో ధారా తన మనుషులతో బిలవాల్ మనుషులపై దాడి చేస్తారు. వారందరిని ఇష్టం వచ్చినట్లు కొడుతారు. బిలవాల్ మనుషులు పారిపోతారు. తరువాత సీన్లో బస్తీ ప్రజలు అందరూ వింతగా చూస్తుంటారు. అక్కడికి ఇస్మయిల్ వచ్చి ఆశ్చర్యంగా చూస్తాడు. అక్కడ పఠాన్ కుస్తీ సామ్రాజ్యాన్ని తగలబెట్టేస్తాడు ధారా.. ఇది నరకపు మంట అని మనలందరికి కాల్చి మసి చేస్తుంది అని ఇస్మయిల్ చెప్తాడు. కట్ చేస్తే హాజీ, పఠాన్, అన్నా రాజన్ జైల్ నుంచి విడుదల అవుతారు.
హాజీ, పఠాన్, అన్నా రాజన్ ల ముందు ధారాను బిలావల్ తిడుతుంటాడు. అతనికి ఏదైనా బుద్ది చెప్పాలి అని పఠాన్ అంటున్న సమయంలో అక్కడికి ఇస్మయిల్ వస్తాడు. ధారా చెప్తే వింటాడు అని అంటాడు. ఇక్కడికి వచ్చి ధారానే క్షమాపణ అడగాలి అని హాజీ అంటాడు. నెక్ట్స్ సీన్లో ధారాను ఒప్పిస్తాడు ఇస్మియిల్. మరో సీన్లో పోలీసులు పఠాన్ గ్యాంగ్ ఛాలెంజ్ చేశాడని, ధారా కూడా హప్తా వసూల్ చేస్తున్నట్లు మాట్లాడుకుంటారు. తరువాత సీన్లో ఇస్మయిల్ తన కొడుకులతో కలిసి హాజీ చోటుకు వెళ్తాడు. అక్కడ హాజీ ధారాతో మాట్లాడుతాడు. క్షమిస్తాను కాని మాతో కలిసి పనిచేయి అంటాడు. దానికి ధారా ఒప్పుకుంటాడు.
బిలవాల్, ధారా ఇద్దరు కౌగిలించుకుంటారు. మరో సీన్లో హాజీ దగ్గరకు వెళ్లి ఇస్మయిల్.. ధారా మీతో కలిసి పని చేయడం ఇష్టం లేదని అంటాడు. దానికి నువ్వు నా గ్యాంగ్ నుంచి వెళ్లొచ్చు అని హాజీ అంటాడు. దాంతో హాజీ దగ్గర ధారా పనిలో చేరుతాడు. నెక్ట్స్ సీన్లో నాసిర్ కోసం ధారా తన ఫ్రెండ్స్ తో వస్తాడు. నాసిర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినందుకు రాడో వాచ్ చూపిస్తాడు. దాంతో నాసిర్ ను తమ దల్లిదండ్రులను మంచిగా చూసుకో అని ధారా గ్యాంగ్ వెళ్లిపోతారు.
చదవండి:Bigg boss 7 telugu:లొ మొదటిసారి అలా జరగబోతోంది!
మరో సీన్లో ధారా స్మగ్లింగ్ దందా మెదలు పెడుతాడు. బిలావాల్ వారికి పని చెప్తాడు. దాన్ని వారు చేస్తూ ఉంటారు. అయినా సరే బిలావల్ వాళ్లను నీచంగా చూస్తాడు. తరువాత సీన్లో పఠాన్ తో తన పగ గురించి చెప్తాడు. దానికి ధారాను చంపడానికి బిలావల్ కు అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్తాడు. తరువాత సీన్లో హమీద్ గ్యాంగ్ వచ్చి ధారాను నోటికివ వచ్చినట్లు మాట్లాడుతారు. అదే టైమ్ లో అక్కడికి హాజీ వచ్చి ధారాను పిలుస్తాడు. ఇద్దరు హార్బర్ లో మాట్లాడుకుంటారు. కోపంతో ఉన్న అలలు కేవలం ఎగిరి పడుతాయి అదే శక్తి ఉన్న సముద్రానికి కోపం వస్తే నగరాలే భయపడుతాయి అని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో నాసీర్ పిలిచి హాజీ మక్బుల్ గురించి ఆర్టికల్ రాయనందుకు కొప్పడుతాడు. మరో సీన్లో ధారా, సాధిక్, హాబీబా మాట్లాడుతుంటే అక్కడికి నాసీర్ వస్తాడు. తన పెళ్లి కార్డును తీసుకొని వస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడికి ఇస్మయిల్ వస్తాడు. తన పెళ్లి గురించి చెప్తాడు. నాసిర్ ను అందరూ ఆట పట్టిస్తారు. తాను వెళ్లాలి అంటే ధారా నేనూ దిగబెట్టి వస్తా అని చెప్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అసలు కలవడం లేదని నాసీర్ అడుగుతాడు. దానికి తాను చేసే పని మంచిది కాదని చెప్తాడు. అయితే తాను చేసే పని కూడా మంచిది కాదని తన ఎడిటర్ హాజీకి అమ్ముడుపోయాడు అని నేను నీ గురించి రాస్తా అని అంటాడు.
మరో సీన్లో బిలావల్ డబ్బులు తీసుకురానందుకు అబ్దుల్లాను, ధారాను తిడుతాడు. తరువాత సీన్లో అబ్దుల్లా, ధారా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏదో ఒకరోజు ముంబాయికి డాన్ అవుతా అంటాడు. అలా బిల్డర్ కోసం వేయిట్ చేసి అతను రాగానే వెళ్లి డబ్బులు అడుగుతాడు. మీలాంటి వాళ్లకు నేను భయపడను అని అంటాడు. ధారా గట్టిగా మాట్లాడుతాడు. బెదిరిస్తాడు. వెంటనే డిల్డర్ భయపడి డబ్బులు ఇస్తాడు. మరో సీన్లో హమీద్ కొత్తగా వచ్చిన అజ్జుని ఆటపట్టిస్తారు. బిలావల్ కూడా వచ్చి అజ్జుకి పని చెప్పి తిడుతాడు. ధారాకు చెప్పకుండా పని చేద్దాం అని అనుకుంటారు. కట్ చేస్తే అజ్జువల్ల పెద్ద తప్పు అయిపోయిందని తన ఫ్రెండ్ చెప్తాడు. బిలావల్ ఇచ్చిన డబ్బును వేరే కష్టమ్స్ ఆఫీసర్ కు ఇవ్వడంతో అజ్జు ఇరక్కుపోతాడు. బిల్డర్ దగ్గర తీసుకున్న డబ్బును కష్టమ్ ఆఫీసర్ కు ఇచ్చి మ్యానేజ్ చేస్తారు. తరువాత సీన్లో అజ్జును తిడుతాడు. కట్ చేస్తే బిలావల్ ధారాను కొడుతాడు. అతన్ని ఆపీ ఆ డబ్బులు కస్టమ్ ఆఫీసర్ కు ఇచ్చినందుకు అబ్దుల్లాను కొట్టమని చెప్తాడు. అబ్దుల్లా కొట్టడంతో ధారా కింద పడుతాడు. తరువాత సీన్లో ధారాకు హాబీబా ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అదే సమయంలో నాసీర్ ను అడ్డుపెట్టుకొని ఒక వార్త ప్రింట్ చేయమని అడుగుతాడు. తరువాత సీన్లో హాజీ మనుషులను అడ్డుగా వెళ్లి అతని సరకును కాజేస్తాడు ధారా. అదే విషయం తరువాత రోజు పేపర్లో వస్తుంది.
అది చూసి ఇస్మయిల్ కొప్పడుతాడు. కాలేజీకి వెళ్లున్న హబీబా ధారా గురించి అడుగుతాడు ఇస్మయిల్. తనకు తెలియదు అని చెప్తుంది. కట్ చేస్తే హాబీబా వాళ్లతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఇస్మయిల్ వచ్చి వాళ్లను తిట్టి నేరుగా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్తాడు. తన కొడుకులను రిమాండ్ లోకి తీసుకోండి అని చెప్తాడు. దానికి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతాడు మల్లిక్.
అదే వార్తను హాజీ చూస్తాడు. పఠాన్ హాజీని రెచ్చగొడుతాడు. నాసీరే ఈ వార్త రాసింది అని మాట్లాడుకుంటారు. నాసీర్, ధారా ఇద్దరు ప్రాణా స్నేహితులు అని మాట్లాడుకుంటారు. గుజరాత్ నుంచి యాసీర్, ఆరీఫ్ లను పిలవాలని పఠాన్ అంటాడు. తరువాత సీన్లో ధారా మల్లిక్ వదిలేయడం వెనుక ఏదో కుయుక్తి ఉందని మాట్లాడుకుంటారు.
నెక్ట్స్ సీన్లో అబ్దుల్లా తన మనుషులను కొడుతుంటే అక్కడి యాసీర్, ఆరీఫ్ ఇద్దరు వచ్చి కాల్చేస్తారు. ధారాను చంపేసి తీసుకోస్తా అంటే హాజీ వద్దు ప్రాణాలతో కావాలంటాడు. కట్ చేస్తే ధారాతో పాటు అబ్దుల్లాను కూడా చంపేయమని తన మనుషులకు చెప్తాడు పఠాన్. తరువాత సీన్లో వర్షంలో స్కూటర్ మీద వస్తున్న ధారాను హాజీ పిలిచాడు అని అబ్దుల్లా చెప్తాడు. కార్లో ధారా కూర్చుంటుండగా అక్కడికి పఠాన్ మనుషులు వస్తారు. వారితో అబ్దుల్లా, ధారా ఫైట్ చేస్తారు. ఈ ఫైట్ లో అబ్దుల్లా అందరిని నైఫ్ తో పొడిచేస్తాడు. అదే నైఫ్ తో ధారా కూడా తన ఫస్ట్ మర్డర్ ను చేస్తాడు.
కట్ చేస్తే ఇస్మయిల్ ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుతుండగా అక్కడికి అబ్దుల్లా వస్తాడు. ధారాను చంపడానికి గుజరాత్ నుంచి పఠాన్ తన మేనల్లుళ్లను దింపినట్లు చెప్తాడు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇకపై నేను కూడా నీతో ఉంటానని అబ్దుల్లా అంటాడు. తరువాత సీన్లో హాజీ పఠాన్ ను తిడుతాడు. ధారాపై ఎటాక్ చేయోద్దు అని చెప్పినా వినలేదు అని నోటికివచ్చినట్లు చెప్తాడు.
తరువాత సీన్లో నాసీర్ వివాహ వేడుకల్లో ధారా ఫ్యామిలీ పాల్గొంటారు. సరదాగా ఉంటారు. తరువాత సీన్లో యాసీర్, ఆరీఫ్ ఇద్దరు కలిసి మందేస్తూ నాసీర్ వల్ల తమకు అవమానం జరిగిందని మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో నాసీర్ తో ధారా గ్యాంగ్ ఆటపట్టిస్తుంటారు. తరువాత కేక్ కట్ చేస్తూ పార్టీ చేసుకుంటారు. ధారా గ్యాంగ్ అక్కడినుంచి వెళ్లిపోతుంది. అంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. చూస్తే సాధిక్.. మళ్లి డోర్ కొడితే అజ్జు వస్తాడు. ఈ సారి డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. చూడడానికి వెళ్లిన నాసిర్ ను కత్తితో పొడుస్తారు యాసీర్, ఆరీఫ్. తన వైఫ్ ను కొడుతారు. నాసీర్ కళ్లముందే తన ఫైఫ్ ను రేప్ చేస్తారు. నాసీర్ విపరీతంగా ఏడుస్తాడు. కట్ చేస్తే కార్లో నాసీర్ తీసుకొని హార్బర్ కు వెళ్లి నీటిలో పడేస్తారు. 5వ ఎపిసోడ్ ముగుస్తుంది. బొంబైలో మరో తీవ్రవైన రక్తపాతానికి ఈ సంఘటన పునాదిగా మారుతుంది. ఇకపై ధారా గేమ్ మొదలు పెడుతాడు. ఇంకా మిగిలిన 5 ఎపిసోడ్స్ ఎక్స్ ప్లనేషన్ పార్ట్ 2 లో చూడండి. ఇప్పటి వరకు మా ఎక్స్ ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏ సినిమాల ఎక్స్ ప్లనేషన్ కావాలో మాకు కామెంట్ చేయండి.