»Bimbisara 2 Director Change A Huge Company As A Partner
Bimbisara 2: ‘బింబిసార 2’ డైరెక్టర్ ఛేంజ్.. పార్ట్నర్గా భారీ సంస్థ!?
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది బింబిసార మూవీ. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి బింబిసార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఈ మధ్యలో సైలెంట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బింబిసార సినిమాతో మల్లిడి విశిష్ట డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఫస్ట్ సినిమానే అయినా గ్రాఫిక్స్ పరంగా.. బింబిసారను చాలా బాగా హ్యాండిల్ చేశాడు వశిష్ట. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. వెంటనే బింబిసార 2 ఉంటుందని అనుకున్నారు. బింబిసార ప్రమోషన్స్‌లో ఈ సినిమా సీక్వెల్‌ను కన్ఫామ్ చేశాడు కళ్యాణ్ రామ్. అంతేకాదు ఈ సినిమా నాలుగైదు సీక్వెల్స్ లేదా ప్రీక్వెల్స్‌గా వస్తుందని.. అందులో ఓ పార్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడని చెప్పాడు. దాంతో బింబిసార2 అప్డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఈ సినిమా తర్వాత కొత్త ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయాడు కళ్యాణ్ రామ్.
ఆ మధ్య అమిగోస్ అనే డిఫరెంట్ సినిమాతో వచ్చినా.. ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం డేవిల్ అనే పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. దాంతో ఇప్పట్లో బింబిసార కష్టమే అనుకున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తప్పుకున్నాడని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే వినిపిస్తోంది. అయితే మల్లిడి వశిష్ఠ ఈ సినిమా దర్శకత్వం వహించకపోయినా.. స్క్రిప్ట్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కమిట్ అయిపోయిన సినిమాలు అయిపోగానే.. బింబిసార 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఇయర్ ఎండింగ్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి.. ఎట్టి పరిస్థితుల్లోను నెక్స్ట్ ఇయర్లో బింబిసార2 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో 2022 ఆగష్టులో రిలీజ్ అయినా ఈ సినిమా నుంచి రెండేళ్ల తర్వాత సీక్వెల్ రానుందని చెప్పొచ్చు.