»Bigg Boss7 War Of Words In Bigg Boss They Are The Ones In The Nominations This Week
Bigg Boss7 : బిగ్‌బాస్‌లో మాటల యుద్ధం.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వారే
బిగ్‌బాస్7లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్స్‌లో అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంకలు నిలిచారు. వాదోపవాదాల మధ్య గొడవల మధ్య ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్7 (Big Boss 7) సీజన్ 13 వారాలను పూర్తి చేసుకుంది. 14వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆదివారం గౌతమ్ ఎలిమినేట్ (Gowtham Eliminate) కాగా సోమవారం నుంచి నామినేషన్స్ హడావుడి ప్రారంభమైంది. నామినేషన్స్ ప్రక్రియలో ఎప్పటిలాగే ఒకరినొకరు అరుచుకున్నారు. వాదోపవాదాల మధ్య నామినేషన్స్ జరిగాయి. ఇప్పటికే అర్జున్ ఫైనల్‌కి చేరుకోవడంతో ఈ వారంలో అర్జున్ నామినేషన్స్‌లో ఉండడని బిగ్‌బాస్ స్వయంగా చెప్పాడు.
ఇకపోతే మిగిలిన వాళ్లలో యావర్ తన కో కంటెస్టెంట్లలో శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు. అలాగే శోభాశెట్టి..యావర్, శివాజీలను నామినేట్ చేయడంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. అమర్, శోభాశెట్టిలను ప్రశాంత్ నామినేట్ చేయగా అర్జున్ మాత్రం అమర్, యావర్‌లను నామినేట్ చేయడం విశేషం. ప్రియాంక కూడా అమర్, యావర్‌లను నామినేట్ చేసేసింది. శివాజీ అయితే ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు. ఇక చివరగా అమర్ తన కో కంటెస్టెంట్స్ ప్రశాంత్, యావర్‌లను నామినేట్ చేశాడు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
నామినేషన్స్ అంతా కూడా ఎప్పటిలాగానే సీరియల్ బ్యాచ్ వర్సెస్ శివాజీ బ్యాచ్ లాగానే సాగాయి. బిగ్‌బాస్ సీజన్ పూర్తి కావస్తున్న తరుణంలో కూడా ఒక గ్రూప్‌తో మరో గ్రూప్ మరింతగా గొడవకు దిగుతోంది. సోమవారం నామినేషన్స్ ప్రక్రియలో ప్రశాంత్, అమర్ ఒకరిపై మరొకరు ఆగ్రహంతో కొట్టుకునే వరకూ వెళ్లారు. ఇక మొత్తంగా చూస్తే ఈ వారం నామినేషన్స్‌లో అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంకలు నిలిచారు.