నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది.
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలన్నీ విజయవంతమైనా ఈ మధ్యకాస్త బ్రేక్ ఇచ్చాడు. రెండు మూడేళ్ల నుంచి నాని నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదనే టాక్ ఉంది. దీంతో నాని ఫ్యాన్స్ ఆయన కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని కూడా తన కంఫర్ట్ జానర్ నుంచి ‘దసరా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చి 30వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్లను ప్రారంభించింది.
దసరా సినిమాకు సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మధ్యనే టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్ డేట్ ను తీసుకురానుంది. ఫిబ్రవరి 14వ తేదిన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని బ్రేకప్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దీని గురించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాలోని పాటలకు సాహిత్యాన్ని అందించారు.
దసరా సినిమాలో కథనాయికగా కీర్తి సురేష్ నటిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారంగా దసరా సినిమాకు అన్ని హక్కులను కలిపి రూ.80 కోట్ల వరకూ వ్యాపారం జరిగింది. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్లని, ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ రూ.15 కోట్ల ప్రాఫిట్లో ఉన్నట్టేనని అర్థమవుతోంది. నాని ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో పాత్ర చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.