Bhola Shankar Movie: భోళాశంకర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 'భోళాశంకర్'(Bhola Shankar) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. ఈ మధ్యనే ‘ఖైదీ నెంబర్150’తో మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఆ తర్వాత అదే జోరును చిరు కంటిన్యూ చేయలేకపోయారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘సైరా’ తెలుగులో హిట్ అయ్యింది. కానీ మిగిలిన భాషల్లో అంతగా ఆడలేదు. ఆ సినిమా ఫలితంతో చిరు ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆచార్య(Acharya) సినిమాతో గతేడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు చిరు వచ్చారు. అందులో తన కొడుకు చరణ్(Ram Charan)తో కలిసి నటించగా భారీ అంచనాల మధ్య ఆ సినిమా విడుదలైంది. కొరటాల శివ(Koratala Shiva) వంటి ఫ్లాప్ ఎరుగని దర్శకుడు ఆ సినిమా చేయడంతో అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
ఆచార్య(Acharya) సినిమా ఫ్లాప్ నుంచి కోలుకునేలోపే మెగా ఫ్యాన్స్ కు ‘గాడ్ ఫాదర్'(God Father) సినిమా రూపంలో మరో దెబ్బ తగిలినట్లయ్యింది. దసరా కానుకగా రిలీజైన ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ సినిమా టాక్ తో మెగాస్టార్ పని అయిపోయిందని, ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వస్తుందని అందరూ విమర్శలు గుప్పించారు. వాటన్నింటినీ దాటుకుంటూ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విమర్శలు చేసిన వారే ఆ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. వింటేజ్ చిరు వచ్చాడని మెగా ఫ్యాన్స్ సందడి చేశారు. చిరుకు తోడు మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) ఆ సినిమాలో నటించడంతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల వర్షం కురిసింది. సంక్రాంతికి కలెక్షన్ల వరద పారి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
On This Auspicious Day ❤🙏#MegaStar 's Much Awaited Movie #BholaaShankar Promotions Kick Start From Today 🔥💥
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు అదే జోష్ తో ‘భోళాశంకర్'(Bhola Shankar) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ రిలీజైన పోస్టర్లు మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. శనివారం భోళాశంకర్(Bhola Shankar) సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాలో తమన్నా చిరుకు జోడీగా నటిస్తోంది. కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమా తమిళంలో విజయం సాధించిన ‘వేదాళం’ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతోంది.