పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత 'భోళా శంకర్' మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ సినిమాకు సంబంధంచిన మెగాస్టార్ పనులు అయిపోవడంతో.. వెకేషన్‌కు చెక్కేశారు.
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత స్ట్రెయిట్ మూవీ చేయకుండా.. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్(Megastar Chiranjeevi). ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్ట్ 11న భోళా శంకర్(Bhola shankar)ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భోళా శంకర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ మధ్య రిలీజ్ చేసిన ‘భోళా మేనియా’ అనే ఫస్ట్ సింగిల్‌లో మెగాస్టార్ తనదైన స్టెప్పులతో అదరగొట్టేశాడు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఈ సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి.. థియేటర్స్ లో కలుద్దాం.. భోళాశంకర్ ఆగస్టు 11న రాబోతోంది’ అని ట్వీట్ చేశారు మెగాస్టార్.
ఇక భోళా శంకర్(Bhola shankar) డబ్బింగ్ కంప్లీట్ అవడంతో.. ఫారిన్ ట్రిప్‌కు వెళ్లిపోయారు చిరు. భార్య సురేఖతో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కేశాడు. ఈ సందర్భంగా.. సురేఖతో కలిసి షార్ట్ హాలిడే ట్రిప్‌కు వెళ్తున్నాను.. తిరిగొచ్చాక నెక్స్ట్ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతానని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయబోతున్నారు మెగాస్టార్.