OTT Movies: ఈ వారం ఓటిటి దండయాత్ర మామూలుగా లేదుగా!
జూన్‌లో ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక పోయిన వారం వచ్చిన సినిమాలు కూడా పర్వాలేదనిపించాయి. అలాగే ఓటిటిలోను సినిమాల సందడి గట్టిగానే ఉంది. ఈ వారం థియేర్లతో పాటు.. ఓటిటిలో వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఓ సారి చూస్తే..
పోయిన వారం తెలుగులో రిలీజ్ అయిన స్పై, సామజవరగమన సినిమాల్లో.. సామజవరగమన మంచి హిట్ టాక్ అందుకుంది. శ్రీ విష్ణు తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కగా.. నిఖిల్ స్పైతో మెప్పించలేకపోయాడు. ఇక ఈ వారం నాగ శౌర్య ‘రంగబలి’, జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాలతో పాటు ఇంకొన్ని సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. అయితే.. ఈ వారం థియేటర్లో కంటే ఓటిటిలో వచ్చిన సిరీస్, సినిమాల దండయాత్ర ఓ రేంజ్లో ఉంది.
జులై 7న రిలీజ్ అయిన అన్ని భాషల ఓటిటి సినిమాలు, సిరీస్‌లు ఓసారి చూస్తే.. అమెజాన్ ప్రైమ్‌లో ‘అదురా’, ‘ద హారర్ ఆఫ్ డోలెరస్ రోచ్’ జూలై 7న రిలీజ్ అయ్యాయి. అంతకుముందు ‘బాబీలోన్’ జూలై 5న.. ‘స్వీట్ కారం కాఫీ’ జూలై 6 స్ట్రీమింగ్కు వచ్చాయి. ఇక నెట్ ఫ్లిక్స్‌లో ‘ఫేటల్ సెడక్సన్’, ‘ద ఔట్ లాస్’, ‘ద పోప్స్ ఎక్సార్సిస్ట్’, ‘హాక్ మై హోమ్’, ‘డీప్ ఫేక్ లవ్’ జూలై 7న రిలీజ్ అయ్యాయి. ఇదే వారంలో.. ‘అన్నోన్: ద లాస్ట్ పిరమిడ్’, ‘ద ఆర్ట్ ఆఫ్ ఇన్ కార్సేరేషన్’, ‘హోమ్ రెకర్’ జూలై 3 డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి.
కాగా ‘ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 1’ జూలై 6న రిలీజ్ అయింది. ఇక డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో ‘IB 71’ జూలై 7న స్ట్రీమింగ్కు వచ్చేసింది. కాగా ‘గుడ్ నైట్’ 3న.. ‘కిజాజీ మోటో: జనరేషన్ ఫైర్’ 5న విడుదలయ్యాయి. జీ5లో ‘అర్చిర్ గ్యాలరీ’, ‘తర్లా’ ఆడియెన్స్ ముందుకొచ్చాయి. సోనీ లివ్‌లో ‘ఫర్హానా’, ‘హవా’ ఈ వారం విడుదలయ్యాయి. మరి ఈ సిరీస్‌ల పై మీరు కూడా ఓ లుక్కేయండి.