బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్ సనాఖాన్(Sanakhan) తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. నందమూరి కళ్యాణ్ రామ్(nandamuri Kalyan Ram)తో ‘కత్తి’ సినిమా చేసి టాలీవుడ్ (Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే మంచు మనోజ్(manchu Manoj)తో ‘మిస్టర్ నూకయ్యా’ సినిమాలో కనిపించింది. 2005 బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యింది. ఇప్పటి వరకూ ఆమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.
2020లో అనాస్ సయ్యద్(Anaas sayyad)ను పెళ్లి చేసుకున్న సనాఖాన్(sanakhan) సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాను తల్లిని అయినట్లు ఆమె ఇన్‌స్టా(Instagram) ద్వారా చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram) లో ఓ నోట్‌ను షేర్ చేసింది. తనపై ప్రేమాభిమానులు చూపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అందరి దీవెనలు తన బిడ్డపై ఉండాలని కోరింది. బిడ్డకు జన్మనిచ్చిన సనాఖాన్(sanakhan)కు ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.