»Pooja Hegde Wants Peace White Colour Dress Glamorous Photos
Pooja hegde: శాంతి కోరుకుంటున్న పూజా హెగ్డే
టాలీవుడ్లో స్టార్ హీరోయిగా ఎదిగింది పూజా హెగ్డే(pooja hegde). వరుణ్ దేశ్ ముకుంద సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. అయినా ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయికి చెక్కేసింది.
టాలీవుడ్ లో పూజా హెగ్డే కెరీర్ అయిపోయినట్లే అనుకునే సమయంలో ఆమెకు అలవైకుంఠ పురంతో హిట్ పడింది. అంతే, అక్కడి నుంచి పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన ఆమే నటించింది. ఇప్పటికీ ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఉన్నాయి. యువ హీరోయిన్లు ఎంత మంది వచ్చినా, ఆమె స్థానం ఆమెకు పదిలంగా ఉండిపోయింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తెలుగు రంగు డ్రెస్ లో మెరిసిపోయింది.