»Bhagwant Kesari Event In Warangal Venue And Time Fix
Warangalలో ‘భగవంత్ కేసరి’ ఈవెంట్.. వెన్యూ అండ్ టైం ఫిక్స్!
వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'భగతవంత్ కేసరి' సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడా అంచనాలను ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రాబోతోంది. అందుకు వేదిక వరంగల్ కానుంది.
Bhagwant Kesari' event in Warangal.. Venue and time fix!
Bhagwant Kesari: అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా బాలయ్యని ఒక సరికొత్త యాంగిల్లో చూడబోతున్నారు అంటూ.. ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 8వ తేదీన, ఆదివారం నాడు వరంగల్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. రాత్రి 8:16 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక్కడి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడప్ కానున్నాయి.
ప్రస్తుతం బాలయ్య ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే.. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలకృష్ణ తన 109 వ సినిమాను డైరెక్టర్ బాబీతో చేయబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకపై సూర్యదేవర నాగవంశీ మూవీని నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మ్యాడ్ ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు నాగవంశీ. ఈ మధ్య కాలంలో అస్సలు టచ్ చేయని గెటప్, క్యారెక్టరైజేషన్‌తో బాలకృష్ణ పాత్ర ఉంటుందని తెలిపాడు. ఈ సినిమా సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు వచ్చే యాక్షన్ అదరిపోతుందని చెప్పుకొచ్చాడు.