అదేంటి.. ఇప్పుడు మెగాస్టార్ నడవడం ప్రాక్టీస్ చేయడమేంటి? అనే డౌట్స్ రావొచ్చు. కానీ మీరు చదివింది నిజమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పుడు మెగాస్టార్ ఏం చేస్తున్నాడు? హెల్త్ కండీషన్ ఎలా ఉంది?
Megastar: ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి రీమేక్ సినిమాతో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా మెహర్ రమేష్తో చేసిన భోళా శంకర్ భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ట్రోలింగ్ బారిన కూడా పడ్డాడు చిరు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. చిరు కెరీర్లోనే భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతోంది. అలాగే కళ్యాణ్ కృష్ణతో మెగా 156 కూడా లైన్లో ఉంది. ఇలా వరుస సినిమాలు లైన్లో పెడుతున్న మెగాస్టార్.. ఈ మధ్య మోకాలికి సర్జరీ జరిగిందనే న్యూస్ వైరల్గా మారిన సంగతి తెల్సిందే.
భోళా శంకర్ సినిమా రిలీజ్కు ముందే చిరు విదేశాలకు వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకొని ఇండియా వచ్చాడని అన్నారు. అప్పటినుంచి ఇంటికే పరిమితమయ్యాడట చిరు. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న చిరుకు.. ఆక్వా థెరపీ, ఫిజియో థెరపీ లాంటివి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయట. ఇప్పడిప్పుడే ఇంట్లో చిరు ఒక్కడే నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఏ సపోర్ట్ లేకుండా నడుస్తున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ వరకు మెగాస్టార్ పూర్తిగా కోలుకొని.. కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడని తెలుస్తోంది. కానీ మెగాభిమానులు మోకాలి సర్జరీతో ఇబ్బంది పడుతున్నాడని తెలియడంతో.. మెగాభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.