»Bellamkonda Sai Sreenivas Released In Public Interest Bellamkonda With Director Bhimla Naik
Bellamkonda Sai Sreenivas: ప్రజాహితముకై జారీ.. భీమ్లా నాయక్ డైరెక్టర్‌తో బెల్లంకొండ
సినిమా బ్యాగ్రౌండ్‌తో గ్రాండ్‌గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కెరీర్ మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో నెక్స్ట్ భీమ్లా నాయక్ డైరెక్టర్‌తో ప్రజాహితముకై జారీ.. అంటూ వచ్చేస్తున్నాడు.
Bellamkonda Sai Sreenivas: ‘అల్లుడు శీను’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా లాంచ్ చేశాడు వి.వి.వినాయక్. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలతోను జస్ట్ ఓకె అనిపించుకున్నాడు. అయితే ‘రాక్షసుడు’ లాంటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో రేసులో వెనకబడిపోయాడు బెల్లంకొండ. చివరగా తనను హీరోగా లాంచ్ చేసిన దర్శకుడు వివి వినాయక్‌తో హీందీలో గ్రాండ్‌గా లాంచ్ అవడానికి.. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను రిమేక్ చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అప్ కమింగ్ మూవీస్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ‘భీమ్లా నాయక్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. అందులో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లుగా తెలిపారు. తెలంగాణ డీఎస్పీగా ఛార్జ్ తీసుకుంటున్నట్లు.. ప్రజాహితముకై జారీ చేయడమైనది.. అంటూ లెటర్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ బాబు ‘రాక్షసుడు’ డైరెక్టర్ రమేశ్ వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమా కూడా థ్రిల్లర్ జోనర్లో సాగుతుందట. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి అఫీషయిల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. మరి పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.