సైకో ఈజ్ బ్యాక్ అని ట్రైలర్లో చెప్పారు.. కానీ సైంధవ్ ట్రైలర్ చూసిన తర్వాత వెంకీ ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి. సంక్రాంతికి వెంకటేష్ నుంచి వస్తున్న సైంధవ్ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేయగా.. వెంకీని చూస్తే అరాచకం అనేలా ఉన్నాడు.
Saindhav: హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తన కెరీర్ 75వ ప్రాజెక్ట్‌గా సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటించగా.. సంక్రాంతి కానుకగా జనవరి 13న సైంధవ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే.. సైంధవ్‌లో మొత్తం 9 ఫైట్ సీక్వెన్స్‌లు ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు. దీంతో కమల్ హాసన్ విక్రమ్ రేంజ్లో సైంధవ్ ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్‌తో సైంధవ్ మామూలుగా ఉండదని చెప్పేశారు.
గతంలో ధర్మ చక్రం, ఘర్షణ సినిమాలో చూసిన యాంగ్రీమ్యాన్ వెంకీ ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి. కూతురు సెంటిమెంట్‌తో స్టార్ట్ అయిన సైంధవ్ ట్రైలర్.. యాక్షన్ సీన్స్‌తో ఊచకోత అనేలా ఉంది. కూతురికి అరుదైన డిసీస్ రావడం.. ఇంకొన్ని రోజులే బతుకుందని చెప్పడం.. అందుకోసం 17 కోట్ల విలువ చేసే వైల్స్ అనే ఇంజక్షన్ కావాలి.. దాని కోసం తండ్రి ఏం చేశాడు? అసలు సైంధవ్ గతం ఏంటి? కూతురును ఎలా కాపాడుకున్నాడు? అందుకోసం తన గతానికి వెళ్లి ఎలాంటి పోరాటం చేసాడు? అనేదే సైంధవ్ కథగా అని ట్రైలర్‌తోనే చెప్పేశారు. మూడున్నర నిమిషాలు కట్ చేసిన ఈ ట్రైలర్లో ఒకటిన్నర నిమిషం తర్వాత సైకో ఈజ్ బ్యాక్ అంటూ.. వెంకటేష్ విశ్వరూపం చూపించాడు.
తమిళ్ హీరో ఆర్యతో పాటు ముఖేష్ రిషి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా కీ రోల్ ప్లే చేయగా.. వెంకీ మామ వైఫ్‌గా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తోంది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మొత్తంగా హత్తుకునే కూతురు సెంటిమెంట్.. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సైంధవ్ ట్రైలర్ అదిరిపోయింది. కాకపోతే వైలెన్స్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కానీ వెంకీ ఏజ్‌కు తగ్గట్టుగా ఇది కరెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. మరి సైంధవ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.